విజయ్ – రష్మిక డెస్టినేషన్ వెడ్డింగ్.. ముహూర్తం ఫిక్స్..!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్‌ రష్మిక మందన ప్రస్తుత ఎవరి కెరీర్ పరంగా వాళ్లు వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే వీళ్ళిద్దరి మధ్య ప్రేమాయ‌ణం నడుస్తుందంటూ గత కొన్నాళ్లుగా వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు.. పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమయ్యారంటూ స‌మాచారం. అయితే.. ఈ ప్రేమ, పెళ్లి వార్తలపై వీళ్ళిద్దరూ అఫీషియల్ ప్రకటన ఇవ్వకపోయినా.. ఇక ఇప్పుడు వీళ్లిద్దరి వెడ్డింగ్ డెస్టినేషన్ తోపాటు.. పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ అయిందంటూ సమాచారం.

వచ్చే ఏడాదికి ఫిబ్రవరిలోనే వీళ్ల‌ వివాహం జరగనుందని.. డేట్ కూడా ఫైనల్ చేశారంటూ సమాచారం. అంతేకాదు.. డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఓ ప్రత్యేకమైన ప్లేస్‌ను కూడా ఈ జంట ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. 2026 ఫిబ్రవరి 26న ఉదయపూర్ ప్యాలెస్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక ల డెస్టినేషన్ వెడ్డింగ్ గ్రాండ్గా జరగనుందట. ఇక వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వినిపించిన ప్రతిసారి మేము మంచి స్నేహితులం మాత్రమే అంటూ చెప్పుకుంటూ వచ్చారు.

అయితే కొంతకాలంగా రష్మిక మాత్రం.. ఇన్ డైరెక్టర్ వీళ్ళ ప్రేమ‌పై హింట్ ఇస్తూ వస్తుంది. నేను ఈ వార్తలను ఇప్పుడే ధ్రువీకరించలేనని.. అలాగని వాటిని ఖండించనని.. పెళ్లి గురించి ఎప్పుడు ఎక్కడ మాట్లాడాలో అప్పుడు మాట్లాడతా.. కచ్చితంగా మీ అందరితో ఆ విషయాన్ని షేర్ చేసుకుంటా అంతకుమించి ఏం చెప్పలేను అంటూ కామెంట్ చేస్తుంది. ఇప్పటికే గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలతో ఆడియ‌న్స్‌ను ఆకట్టుకున్న ఈ జంట.. త్వరలోనే కీల్ లైఫ్ నుంచి రియ‌ల్ లైఫ్ పెయిర్‌గా మార‌నున్నార‌ని తెలియడంతో.. ఫ్యాన్స్ తెగ సందడి చేసేస్తున్నారు.