ప్రస్తుతం టాలీవుడ్ హైయెస్ట్ బడ్జెట్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అనగానే ఠక్కున వారణాసి పేరు వినిపిస్తుంది. రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా గ్లోబల్ లెవెల్లో రూపొందుతున్న ఈ సినిమా రూ.1300 కోట్ల బడ్జెట్ తో సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీకి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇచ్చే మూవీ అంటే అల్లు అర్జున్ – అట్లీ కాంబో అనే చెప్పాలి. ఇంకా ఈ ప్రాజెక్టు టైటిల్ ఫిక్స్ కాలేదు. అయితే.. ఇప్పుడు వారణాసి కంటే.. అల్లు అర్జున్ మూవీకి ఎక్కువ క్రేజ్ ఉందని వార్తలు తెగ వైరల్గా మారుతున్నాయి. హాలీవుడ్ స్టాండెర్డ్పస్‌తో, హాలీవుడ్ టెక్నిషన్స్‌తో ఈ మూవీ రూపొందుతున్న క్రమంలో.. మూడు లోకాలకు సంబంధించిన కథ గా దానికి తగ్గట్టుగానే సినిమాలో భారీ స్టార్ కాస్టింగ్ ఉండబోతున్నారని తెలుస్తుంది.
ఈ క్రమంలోనే.. నెట్‌ఫ్లిక్స్ సంస్థ.. ఈ క్రేజీ మూవీ డిజిటల్ రైట్స్ దక్కించుకోవడానికి ఏకంగా రూ.600 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం. గతంలో ఇదే నెట్‌ఫ్లిక్స్ వారణాసికి రూ.500 కోట్ల ఇచ్చింది. ఇప్పుడు అల్లు అర్జున్ – అట్లీ సినిమాకు ఒకసారిగా రూ.100 కోట్లు చేయడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఆఫర్‌ను సన్ పిక్చర్స్ యాక్సెప్ట్ చేస్తూందా.. లేదా.. వాళ్ళు ఇంకా ఎక్కువ డబ్బులు కోసం ఆలోచిస్తున్నారా తెలియాల్సి ఉంది. గతంలో అల్లు అర్జున్ తెలుగు సినిమా అల వైకుంఠ పురంకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత.. రిలీజైన పుష్ప, ఫుష్ప 2.. 13 వారాలు పాటు టాప్ ట్రెండింగ్ గా మారింది. దాదాపు.. 30 మిలియన్‌లకు పైగా వ్యూస్ దక్కాయి. ఈ క్రమంలోనే.. భారీ లాభాల వర్షం కురిసింది. ఈ క్రమంలోనే ప్రాజెక్టుకు ఏకంగా అంత బడ్జెట్ ఆఫర్ చేసిందట.

రాబోయే రోజుల్లో ఆఫర్ మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి ఫైనల్‌గా ఎంతకు ఈ డీల్ క్లోజ్ అవుతుందో వేచి చూడాలి. ఇక ఈ సినిమాలో దీపికా పదుకొనే, మృణాల్ ఠాగూర్, జాన్వీ కపూర్ హీరోయిన్లుగా కనిపిస్తుండగా.. రష్మిక విలన్ పాత్రలో ఉందని సమాచారం. ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్‌లో స్టార్ హీరోయిన్‌గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రష్మిక.. కెరీర్‌లో మొదటిసారి.. విలన్ పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఇక.. ఈ సినిమాలో బన్నీ ట్రిపుల్ రోల్‌లో మెరవనున్నాడు.1 ఇప్పటికే 40 శాతం పైగా టాకీ పార్ట్ కూడా కంప్లీట్ చేసేసారట.


