ఇండస్ట్రీ ఏదైన హీరోల మధ్య పోటీ కామన్. ఈ క్రమంలోనే చాలామంది హీరోలు ఒక్కరిని మించిపోయేలా మరొకరి కంటెంట్‌ను ఎంచుకుని మూవీస్ చేస్తుంటారు. వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రస్తుతం నాని సైతం తన సినిమాల విషయంలో ఇదే చేస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో ది ప్యారడైజ్‌తో ఆడియన్స్ ను పలకరించనున్నాడు. వీళ్ళ కాంబోలో గతంలో ‘దసర’ వచ్చి సూపర్ సక్సెస్ కొట్టడం.. మరోసారి ఈ హిట్ కాంబో రిపీట్ అవుతుండటంతో సినిమాపై మంచి హైప్ మొదలైంది.
ఇక ఫస్ట్ నుంచి నానితో పోటీ పడుతున్న విజయ్ దేవరకొండ.. సేమ్ ప్యారడైజ్ తరహాలో రా అండ్ బోల్డ్ కంటెంట్ ఎంచుకుంటున్నాడు. ఇక రవి కిరణ్ కోలా డైరెక్షన్ లో విజయ్ హీరోగా వస్తున్న ‘రౌడీ జనార్ధన్’ సినిమాలో చాలా వైలెంట్ గా కనిపించబోతున్నాడని రీసెంట్ గా వచ్చిన గ్లింప్స్ తో క్లారిటీ వచ్చేసింది. ఈ వీడియోలో విజయ్ క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేశారు టీం. ఇక ప్యారడైజ్, రౌడీ జనార్ధన్ మూవీకి దగ్గర పోలికలు కనిపిస్తున్నాయి.
ఇక శ్రీకాంత్ ఓదెల ది ప్యారడైజ్ సినిమా మార్చ్ నెలలో రిలీజ్ కి సిద్ధం చూస్తున్నాడు. ఇప్పటికే సినిమా షూట్ తుది దిశకు చేరుకుంది. ఇక ఈ సినిమా అనుకున్న టైంకి ప్రేక్షకుల ముందుకు వస్తే మాత్రం.. భారీ కలెక్షన్స్ కొల్లగొట్టడం కాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా శ్రీకాంత్ ఓదెల, విజయ్ ల మధ్య ఎలాంటి గొడవ జరగకపోయిన.. కూడా గతంలో తన దసర కథను విజయ్ రిజెక్ట్ చేశారనే ఉద్దేశ్యం శ్రీకాంత్‌లో ఉందట. ఇక ఆ తర్వాత విజయ్ పిలిచి ఒక సినిమా చేద్దామని అడిగిన కూడా శ్రీకాంత్ మాత్రం దానికి రియాక్ట్ కాలేదు. ఈ క్రమంలోనే.. ప్యారడైజ్ vs రౌడీ జనార్ధన్ మూవీ వార్ నాని వర్సెస్ విజయ్ దేవరకొండ కాకుండా.. శ్రీకాంత్ ఓదెల వర్సెస్ విజయ్ దేవరకొండ మధ్య కాంపీటీషన్ గా మారనుందని టాక్ నడుస్తుంది.

