దేశంలో ఏదైనా కీలక ఘటన జరిగినప్పుడు దేశం మొత్తం స్పందించాల్సిన విషయమే అయినా.. చాలామంది స్టార్లు సెలబ్రిటీలు వాటిపై రియాక్ట్ కారు. మాకు ఏమీ పట్టదు అన్నట్లుగా మెల్లకుండిపోతారు. నిజంగానే అసలు ఈ విషయం వాళ్ళ దాకా వెళ్ళిందా.. లేదా కావాలనే ఆ విషయంపై రియాక్ట్ కాకుండా స్కిప్ చేస్తున్నారా.. అనే సందేహాలు కూడా వస్తూ ఉంటాయి. అయితే.. మరి కొంతమంది సెలబ్రిటీలు మాత్రం దేశంలోని ఎన్నో కీలక విషయాలపై తమ అభిప్రాయాలను కరాకండిగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటారు. అలా.. తాజాగా జాన్వి కపూర్ షేర్ చేసుకున్న ఒక పోస్ట్ నెటింట వైరల్గా మారుతుంది.

ప్రజెంట్ బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందూ మతస్తుల మారణకాండ గురించి అందరికీ తెలిసిందే. తాజాగా చంద్రదాస్ అనే హిందూమతస్తుని ఓ ముఠా తీవ్రంగా కొట్టి చంపేసి.. ఆ డెడ్ బాడీని అక్కడే చెట్టుకు కట్టేసి నిప్పంటిచ్చేసారు. ఈ ఘోరం మొత్తం దేశంలోనే కలకలం గా మారింది. దీనిపై ఇండియా రగిలిపోతుంది. అదే టైంలో కొంతమంది తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలోని బాంగ్లాదేశ్ దౌత్య కార్యాలయం ముందు ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు. ఇలాంటి టైం లో.. 28 ఏళ్ల స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ స్టోరీని షేర్ చేసుకుంది. ఈ ఘటనపై రియాక్ట్ అవుతూ.. ఆమె చేసిన పోస్ట్ నెటింట వైరల్గా మారుతున్నాయి.
బంగ్లాదేశ్లో ప్రస్తుతం జరుగుతున్నది పూర్తిగా అనాగరికమని.. ఇది ఊచకోత అని.. ఒక వివక్త సంఘటన కాదని వివరించింది. ఈ అమానవీయ బహిరంగ హత్యాకాండ గురించి తెలియని వాళ్ళు.. ముందు దాని గురించి తెలుసుకోవాలని.. చదవాలని, వీడియోలు చూడాలని, దానిపై ప్రశ్నించాలంటూ ఆమె రియాక్ట్ అయింది. ఈ మారణకాండ గురించి తెలుసుకున్న తర్వాత కూడా మీకు కోపం రాకపోతే.. మనకు తెలియక ముందే మనల్ని నాశనం చేసే కపటత్వం ఇదే అవుతుంది అంటూ జాన్వీ కపూర్ రాసుకొచ్చింది.
మన సొంత సోదరులు, సోదరీమణులే ఇక్కడ దహనమైపోతుంటే.. ప్రపంచంలో జరిగే ఇతర విషయాల గురించి మనం ఏడుస్తూ ఉంటామని.. మనం మానవత్వం మరిచిపోయే ముందు ఏ రూపంలోనైనా ఉగ్రవాదాన్ని ఖండించాలని ఆమె చెప్పుకొచ్చింది. దీంతో జాన్వి కపూర్ చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ గా మారుతున్నాయి. జాన్వీ కపూర్ నిజాయితీకి, ధైర్యానికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. జన్వీ తన చుట్టూ ఏమి జరుగుతుందో గమనిస్తుంటుందని.. ఈ టైంలో ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఖండించడానికి ఆమె నిజంగా ధైర్యం చాటిందని.. ఎలాంటి కమిట్మెంట్ చూపించకుండా.. విలువైన ముస్లిం మార్కెట్.. డబ్బులు కోల్పోయే భయం లేకుండా తన మనసులో ఉన్నది చెప్పిందని.. చాలామంది బాలీవుడ్ నటులు దీనిపై రియాక్ట్ కాకుండా పిరికిగా బిహేవ్ చేస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.


