సౌత్ స్టార్ హీరోయిన్ సమంతకు టాలీవుడ్లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఇక ఈ అమ్మడు తాజాగా డైరెక్టర్ రాజ్ నిడమోరుతో రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరి పెళ్లి వ్యవహారం నెటింట పెద్ద సంచలనంగా మారింది. పెళ్ళైన మూడు రోజుల వరకు కనీసం వాళ్ళిద్దరి మ్యారేజ్ వ్యవహారం కూడా బయటకు రాకుండా సీక్రెట్ గా ఉంచారు. పెళ్లి ఫోటోలు సోషల్ మీడియా వేదికగా ఈ జంట అఫీషియల్ గా ప్రకటించే వరకు ఇండస్ట్రీలో ఎవరికి అనుమానం రాలేదు.

ఈ క్రమంలోనే తాజాగా సమంతతో కలిసి మా ఇంటి బంగారం సినిమాలో నటించిన బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య వీళ్ళ పెళ్లి పై రియాక్ట్ అయ్యారు. ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. గుల్షన్ దేవయ్య మాట్లాడుతూ.. నేను మా ఇంటి బంగారం షూట్లో భాగంగా సమంతతో రోజు కలిసే పని చేస్తున్న.. షూటింగ్ ముగించుకొని ఇంటికి వెళ్లి.. సరిగ్గా మూడు రోజులకే వాళ్ళిద్దరి పెళ్లి ఫోటోలు చూసి షాక్ అయ్యిపోయా. రాజ్‌తో నాకు పాత పరిచయం ఉంది.. ఇక సమంతతో రోజు షూట్లో పాల్గొన్నా. కనీసం నాకు చిన్న క్లూ కూడా అందలేదు.
అంత సీక్రెట్ గా వాళ్ళు పెళ్లి కానిచ్చేశారు అంటూ గుల్షన్ దేవయ్య కామెంట్స్ చేశారు. 2025 డిసెంబర్ 1న.. ఈషా ఫౌండేషన్‌లో యోగా సాంప్రదాయ పద్ధతిలో వీళ్ళిద్దరు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక గుల్షన్ దేవయ్య సినిమాల పరంగా ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్నాడు. కాంతర చాప్టర్ 1లో ప్రిన్స్ కులశేఖర్ పాత్రలో మెప్పించిన గుల్షన్.. ఇప్పుడు మా ఇంటి బంగారం సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నాడు. సమంత ప్రధాన పాత్రలో.. నందిని రెడ్డి డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్ అంచనాలు ఉన్నాయి. షూటింగ్ గ్యాప్ లో జరిగిన పెళ్లి ముచ్చట్లు ఇప్పుడు టాలీవుడ్ లో వైరల్ గా మారుతున్నాయి.


