30 ఏళ్లు తేడా ఉంటే తప్పేంటి.. హీరోలతో రొమాన్స్ పై యంగ్ బ్యూటీ షాకింగ్ కౌంటర్..

సినీ ఇండస్ట్రీలో ఓ సినిమా తెర‌కెక్కుతుందంటే హీరో, హీరోయిన్ల మధ్య ఏజ్ గ్యాప్ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. దశాబ్దాల కాలంగా కొనసాగుతుంది. ముఖ్యంగా సీనియర్ స్టార్ హీరోలతో యంగ్ హీరోయిన్లు నటిస్తే నెగెటివిటీ మరింతగా మోగిపోతుంది. రకరకాల కామెంట్స్ వైరల్ అవుతూ ఉంటాయి. ఇక ఈ అంశంపై తాజాగా ఓ కన్నడ స్టార్ బ్యూటీ రియాక్ట్ అయింది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా పెద్ద హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ సక్సెస్ లో అందుకుంటున్న ఈ కుర్ర బ్యూటీ.. తనపై వస్తున్న ట్రోలింగ్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. వయసు అనేది కేవలం సంఖ్య‌ మాత్రమేనని.. నటనకు ప్రాధాన్యత ఉన్నప్పుడు అవేమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ వివరించింది.

Happy Birthday Ashika Ranganath: A look At Sandalwood Diva's Film Career | Movies News - News18

ఇప్పటికే ఆమె ఎవరో అర్థమైపోయి ఉంటుంది. ఎస్.. మీ గెస్ కరెక్టే. తనే.. ఆషికా రంగనాథ్‌. ప్రస్తుతం టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ సరసన భక్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించనుంది. 2026 సంక్రాంతి బ‌రిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలో సందడి చేసిన ఆషికా.. ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. ఇక ఇంటర్వ్యూలో ఏజ్ గ్యాప్ గురించి ఆమెకు ప్రశ్న ఎదురయింది. ఈ మూవీలో హీరో వయసు 57 ఏళ్లు కాగా.. ఆమె వయసు కేవలం 29 ఏళ్ళు. అంటే.. వీళ్ళిద్దరి మధ్యన దాదాపు 30 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది.

RaviTeja: 'రవితేజ నా భర్త'.. ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన హీరోయిన్! ఎవరా హాట్  బ్యూటీ? - Telugu News | "Ravi Teja is My Husband!" Says This Hot Beauty;  Dimple Hayathi's Viral Comments at Bhartha ...

ఈ క్రమంలో నెటిజ‌న్స్ నుంచి చాలా నెగటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. దానిపై అషికా రియాక్ట్ అవుతూ.. నేను ఒక నట్టిగా.. నా పాత్ర ఎంతవరకు న్యాయం చేస్తున్న అనేది చూస్తా. యంగ్ హీరోతో చేస్తున్నానో.. లేదా సీనియర్ హీరోలా అనేది నాకు ముఖ్యం కాదు అంటూ కుండ బద్దలు కొట్టినట్లుగా రియాక్ట్ అయింది. గతంలో నాగార్జునతో కలిసి నా సామి రంగ సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఈ సినిమా తర్వాత వరుసగా సీనియర్ హీరోల సినిమాలకే ఇంపార్టెన్స్ ఇస్తూ వస్తుంది. దీనిపై తాజాగా రియాక్ట్ అవుతూ.. నాగార్జున లాంటి హీరోలతో పని చేయడం నా అదృష్టం. ఆయన ఎన‌ర్జీ నాకు షాక్ కలిగించింది. సీనియర్ హీరోలతో పని చేస్తే కెరీర్ కు సంబంధించి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు.. వారి అనుభవం మనకు పాఠాలుగా మారుతుంది అంటూ చెప్పుకొచ్చింది.

Ashika Ranganath : బ్లూ శారీలో మెరిసిపోతున్న ఆషిక రంగనాథ్-Namasthe Telangana

కేవలం గ్లామర్ పాత్రలకే కాదు నటనకు స్కోప్ ఉన్న పాత్రలు నేను ఎంచుకుంటున్నానని ఆమె వివరించింది. ఇక ఈ అమ్మడు ఈ రెండు సినిమాలు తోనే కాదు మెగాస్టార్ తో కలిసి మరో భారీ ప్రాజెక్టులో నటిస్తుంది. అలాగే తమిళ్‌లో కార్తీ సరసన మరో ఛాన్స్ కొట్టేసింది. ఒకప్పుడు సీనియర్ హీరోలతో సినిమాలంటే హీరోయిన్‌లు వెన‌కడుగు వేసే వారు.. మళ్ళీ ఫ్యూచర్లో మంచి అవకాశాలు వస్తాయో.. లేదో అని తడపడే వారు.. కానీ ఇప్పుడు మాత్రం ఈ కన్నడ బ్యూటీ ఏజ్ తో సంబంధం లేకుండా సరైన కంటెంట్ ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక రూట్‌ను క్రియేట్ చేసుకుంటుంది. నటనకు ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలు దొరికితే వయసుతో సంబంధం లేకుండా ఏ హీరో తనైనా రొమాన్స్ చేయడానికి తాను సిద్ధమేనని ఓపెన్ గా క్లారిటీ ఇచ్చేసింది. ఈమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెటింట హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. అంతేకాదు.. ఇప్పటివరకు వచ్చిన నెగటివ్ కామెంట్స్, ట్రోల్స్ కు ఇది స్ట్రాంగ్ కౌంటర్ అనడంలో సందేహం లేదు.