నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి హ్యాట్రిక్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ సీక్వెల్ అఖండ 2 ది తాండవం బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ రెస్పాన్స్ డిసెంబర్ 12న రిలీజ్ అయిన సినిమా విమర్శకులతో సైతం ప్రశంసలు అందుకుంటుంది. ఈ సినిమాలో బాలయ్య రుద్రతాండవం ఆడియన్స్‌లో గూస్ బంప్స్ తెప్పించేలా ఉందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక.. సినిమాలో కథను మలుపు తిప్పే కీలక పాత్ర జనని బాలయ్య కూతురుగా.. ఈ సినిమాలో హర్షాలి మల్హోత్రా నటించిన సంగతి తెలిసిందే. ఆమె నటనకు సైతం ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. అయితే.. తాజాగా జననీ రోల్‌కు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు రివిల్ అయ్యాయి.

సినిమాలో జనని రోల్ చాలా పవర్ఫుల్ కావడంతో.. ఈ పాత్ర కోసం పాపులర్ ఫేస్ ఉంటే బాగుంటుందని బోయపాటి ఫిక్స్ అయ్యాడట. ఇందులో భాగంగానే ఎన్నో ప్రయత్నాలు చేశారని.. మొదట సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార ఘట్టమనేనితో ఈ పాత్ర చేయించాలని భావించినట్లు తెలుస్తుంది. ఇక సితారకు ఉన్న క్రేజ్.. స్వతహాగా ఆమెకున్న చలాకితనం.. పాత్రకు పర్ఫెక్ట్ గా ఉంటాయని సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగా ఉండడంతో.. ఆమె అయితేనే పర్ఫెక్ట్‌గా ఉంటుందని భావించారట. కానీ.. ఏవో కారణాలతో అది వర్కౌట్ కాలేదు. దీంతో మళ్ళీ మేకర్స్ జననీ కోసం అన్వేషణ మొదలుపెట్టారు.
అదే టైంలో.. కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య కుమార్తె దియా పేరు కూడా వినిపించింది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ లయ కుమార్తెను కూడా ఈ పాత్ర కోసం అప్రోచ్ అయ్యారట. ఇలా.. ఎంతోమంది స్టార్ కిడ్స్‌ను పరిశీలించిన తర్వాత చివరకు జనని రోల్ కోసం హర్షలిని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇక.. ఈ పాత్రలో ఆమె చూపించిన నటన, పలకరించిన హవభావాలు థియేటర్లో ప్రేక్షకులను ఫిదా చేసేసాయి. ముఖ్యంగా బాలయ్యతో తననుకున్న బాండింగ్.. క్లైమాక్స్ సీక్వెన్స్ లలో ఆమె పెర్ఫార్మన్స్.. స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. అలా అఖండ 2 ఇంత మంచి సక్సెస్ సాధించడంలో జనని రోల్ కూడా కీలకపాత్ర వహించింది అనడంలో సందేహం లేదు.

