డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇప్పటికే ఇండస్ట్రీలో ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. పలు ప్రొడక్షన్ బ్యానర్ల దగ్గర ముందే భారీగా అడ్వాన్స్‌లో తీసుకొని.. ఇప్పటివరకు ఎలాంటి ప్రాజెక్టును మొదలుపెట్టలేదని.. సరిగ్గా రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదు అంటూ చర్చలు హాట్ టాపిక్‌గా మారాయి. దీనిపై ప్రశాంత్ వర్మ సైతం రియాక్టై క్లారిటీ ఇచ్చాడు. అయితే.. ఇప్పుడు నందమూరి నటసింహం బాలకృష్ణ సైతం ప్రశాంత్ వర్మపై లీగల్‌గా కేస్ వేయనున్నాడట. ప్రశాంత్ వర్మతో బాలయ్యకి మంచి రిలేషన్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన హోస్ట్గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె టాక్ షోకి డైరెక్టర్‌గా ప్రశాంత్ వర్మ పనిచేసాడు. ఆ టైంలోనే వీళ్ళిద్దరి మధ్యన బాండ్ కుదిరింది.
![]()
ప్రశాంత్ వర్మ పనితీరుకు బాలయ్య ఫిదా అయ్యాడు. అదే టైంలో.. హనుమాన్ సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో.. ప్రశాంత్ వర్మను నమ్మిన బాలయ్య.. తన కొడుకు మోక్షజ్ఞతేజ ఎంట్రీ బాధ్యతలను ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టాడు. మరో రెండు రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందనూ టైంకి ప్రశాంత్ వర్మ.. సినిమా నుంచి తప్పుకొని బాలయ్యకు బిగ్ షాక్ ఇచ్చాడు. తన శిష్యుడు ఈ సినిమాకు డైరెక్టర్గా వ్యవహరించేలా చేస్తానని బాలయ్యకు వివరించాడట. ఈ ప్రతిపాదనకు బాలయ్య నో చెప్పి.. దర్శకుడుగా చేస్తే నువ్వు చెయ్.. లేదంటే సినిమానే వద్దని కరాకండిగా చెప్పేసాడట. అంతేకాదు.. ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్‌కు ముందే బాలయ్య ప్రశాంత్ వర్మ కు రూ.25కోట్ల అడ్వాన్స్ ఇచ్చాడట.
![]()
డబ్బులు తీసుకుని షూటింగ్ మొదలయ్యే టైంకి ఇలా రూట్ మార్చడంతో.. బాలయ్య ఫుల్ ఫైర్ అయిపోయాడని.. ప్రశాంత్ వర్మ పై గట్టిగానే వారించినట్లు తెలుస్తోంది. బాలయ్య కోపం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయినా.. ప్రశాంత్ వర్మ కాస్త కూడా పాజిటివ్గా రెస్పాన్స్ ఇవ్వలేదు సరికదా రిషబ్‌తో జై హనుమాన్ సినిమాను నిర్మిస్తూ బిజీబిజీగా గడుపుతున్నాడు. ఇది బాలయ్యకు అస్సలు నచ్చకపోవడంతో.. బాలయ్య పోలీస్ స్టేషన్లో ప్రశాంత్ వర్మపై కేసు ఫైల్ చేయడానికి సిద్ధమయ్యడట. ఈ వార్ ఎక్కడిదాకా వెళ్లి ఆగుతుందో.. అనే సందేహలు ఇండస్ట్రీ వర్గాల్లో మొదలయ్యాయి.

