పెళ్లికి ముందే విజయ్‌ – రష్మిక క్రేజి డెసిషన్.. అలాంటి అగ్రిమెంట్ పై సైన్..!

టాలీవుడ్ మోస్ట్ పాపులర్ రూమ‌ర్డ్ క‌పూల్‌గా విజయ్, రష్మిక పేర్లు తెగ‌ వైరల్ గా మారుతున్నాయి. వీళ్ళిద్దరి బంధంపై ఎక్కడ అఫీషియల్‌గా అనౌన్స్ చేయకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం వీళ్ళిద్దరి ప్రేమ, డేటింగ్, ఎంగేజ్మెంట్, పెళ్లి వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దసరా సెలబ్రేషన్స్ సమయంలోనే ఈ జంట నిశ్చితార్థం చేసుకుని ఒకటయ్యారని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఫిబ్రవరి 26న ఈ జంట గ్రాండ్ లెవెల్లో వివాహం చేసుకోబోతున్నారంటూ టాక్‌ కూడా వినిపిస్తుంది. అయితే.. వీళ్ళిద్దరూ దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయకపోయినా బ్యాక్ డ్రాప్‌లో పెళ్లి ఏర్పాట్లు మాత్రం చాలా స్పీడ్ గా జరుగుతున్నాయని టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో తెగ వైరల్ గా మారుతుంది.

Vijay Deverakonda and Rashmika Mandanna Officially Engaged, Wedding in  February 2026

ఇక్కడ అన్నింటికంటే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. పెళ్లికి ముందే విజయ, రష్మికలు ఓ స్పెషల్ అగ్రిమెంట్ పై సైన్ చేశారట. ప్రస్తుతం ఇదే టాక్ సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్ గా మారింది. ఈ అగ్రిమెంట్ వెనుక ఓ స్ట్రాంగ్ పర్సన్ కూడా ఉన్నాడంటూ సమాచారం. ఆయన ఎవరో కాదు.. గీత గోవిందం మూవీ డైరెక్టర్ పరుశురాం. ఈ మూవీ టైంలోనే వీళ్ళిద్దరి మధ్యన మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడి.. అది కాస్త ప్రేమగా మారిందట. అంతేకాదు.. వీళ్ళిద్దరితో పరుశురాంకు కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ క్రమంలోనే విజయ్ ర‌ష్మిక‌లకు వ్యక్తిగతంగాను సూచనలు ఇచ్చేంత క్లోజ్ గా పరుశురాం ఉంటాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

గీతా గోవిందం 7 సంవత్సరాలు జరుపుకుంది: విజయ్ దేవరకొండ రష్మిక మందన్న,  దర్శకుడు పరశురామ్ పెట్ల మరియు సిబ్బందిని గుర్తు చేసుకున్నారు ...

అయితే.. ప్రస్తుతం పెళ్లి న్యూస్ల వైరల్ అవుతున్న క్రమంలో.. మళ్లీ ఇద్దరినీ కలిపే పనిలో బిజీ అయ్యాడట. పెళ్లి తర్వాత సరైన టైంకి విజయ్‌, రష్మికలను మళ్ళీ ఒకసారి బిగ్ స్క్రీన్ పై లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌లో చూపించాలని ప్లాన్ చేశాడట. దీనికోసమే.. వీళ్ళిద్దరిని కలిసి ఓ ఫ్రెండ్లీ అగ్రిమెంట్ కూడా మాట్లాడేసుకున్నార‌ని.. భవిష్యత్తులో ఈ సినిమాలో కలిసిన నటించేందుకు ఈ జంట కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక విజయ్, ర‌ష్మిక, పరశురాం కాంబో లో వచ్చిన గీత గోవిందం ఎలాంటి సక్సెస్ అందుకుందో చూసాం. అందుకే మళ్ళీ అదే మ్యాజిక్ రిపీట్ అయ్యే అవకాశం ఉంటే మాత్రం కచ్చితంగా బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేస్తుందంటూ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు పై కాని.. పెళ్లి పై కానీ.. ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాకుండా.. రెండింటిపై ఈ జంట ఒకేసారి అప్డేట్ ఇచ్చి అందర్నీ ఖుషి చేస్తారని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.