” స్పిరిట్ ” కోసం రంగంలోకి మరో స్టార్‌ హీరో.. సందీప్ మాస్టర్ ప్లాన్‌ అదుర్స్..!

ప్రస్తుతం పాన్ ఇండియ‌న్ రెబ‌ల్ స్టార్‌ ప్రభాస్.. చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక.. ఆయన లైనప్‌లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఏది అనగానే స్పిరిట్ పేరే వినిపిస్తుంది. సందీప్ రెడ్డి లాంటి సెన్సేషనల్ డైరెక్టర్ రూపొందిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అనౌన్స్మెంట్ అప్పటినుంచి ఆడియోస్ లో భారీ హైప్ మొదలైంది. ఇక సినిమాలో మునిపన్నడు లేని రేంజ్ లో ప్రభాస్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా మేరవనున్నాడు. తృప్తి దిమ్రి హీరోయిన్గా.. జపాన్ నటుడు డాన్లీ విలన్ పాత్రలో కనిపించనున్నారు.

అయితే.. తాజాగా సినిమాకు సంబంధించిన మరో కీలక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. సందీప్ రెడ్డి వంగ మాస్టర్ ప్లాన్‌కు ఆడియన్స్‌ ఫీదా అవుతున్నారు. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటంటే.. సినిమాలో కీలక పాత్ర కోసం మరో స్టార్ హీరోను రంగంలోకి దింపుతున్నాడట సందీప్. ఆ హీరో మరెవరో కాదు మలయాళంలో తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకున్న మోహన్ లాల్. ఆయన ఈ సినిమాలో.. ఒ కీ రోల్‌లో నటించే అవకాశం ఉందని టాక్ తెగ వైరల్ గా మారుతుంది.

Mohanlal - Wikipedia

ఇక మోహన్లాల్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం మలయాళం కాదు.. టాలీవుడ్ లోను ఆయనకు మంచి ఇమేజ్ ఉంది. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్‌లో మరింత ఆసక్తి మొదలైంది. అయితే ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలియాలంటే సందీప్ అఫీషియ‌ల్‌గా వెల్ల‌డించాల్సిందే. ఇక ఇప్ప‌టికే సినిమా కొత్త స్కెడ్యూల్ కోసం టీం సన్నాహాలు మొదలుపెట్టారు. భారీ సెట్ వేసేస్తున్నారు. ఈ సెట్లో రెండు వారాలు పాటు యాక్షన్ సీక్వెల్స్ షూట్ జరగనుందని.. ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమా మొత్తం మూవీలో హైలెట్ గా నిలుస్తాయంటూ సమాచారం. ఇక ఓ సరికొత్త తరహా క‌థంశాంతో సందీప్ రెడ్డి ఆడియ‌న్స్‌ను ప‌ల‌క‌రించ‌నున్నాడ‌ని.. త‌న‌ మార్క్ స్టోరీ తో.. మ‌రోసారి రికార్డ్స్ బ్లాస్ట్ అవడం ఖాయ‌మ‌ని తెలుస్తుంది.