SSMB 29: ఫుల్ స్టోరీ అదేనా.. బాహుబలి, RRR రికార్డులు బద్దలు కొడుతుందా..!

గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా.. గ్లోబ‌ల్ ట్రోట‌ర్ ట్యాగ్‌ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో తెర‌కెక్కుతున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబి 29 రన్నింగ్ టైటిల్ ఇది. మొదట్లో ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్ ఫిక్స్ చేశారంటూ టాక్ వినిపించినా.. తర్వాత సంచారి.. మూవీ అసలు టైటిల్ అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రీసెంట్‌గా.. ఈ సినిమాకు సంబంధించిన థీమ్ సాంగ్ రిలీజ్ చేయగా అందులో మొదటి నుంచి ఎండ్ వరకు సంచారి అనే పదాన్ని తరచు వాడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే సినిమా టైటిల్ కూడా అదే అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ.. రెండిట్లో నిజమైన టైటిల్ ఏదో మాత్రం మేకర్స్ రేపటి ఈవెంట్లో అఫీషియల్ గా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.

JioSaavn - Listen to New & Old Indian & English Songs. Anywhere, Anytime.

ఇలాంటి క్రమంలోనే.. సినిమా సాంగ్స్ కంపోజ్‌ చేస్తున్న శంకర్ మాస్టర్.. ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తను మాట్లాడుతూ.. రాజమౌళి గారు కేవలం ఫస్ట్‌హాఫ్ మాత్రమే మాకు వినిపించారని.. ప్రతి సీన్, ప్రతిషాట్, యాక్షన్స్‌తో సహా.. ఎమోషన్స్ కళ్ళకు కట్టినట్లు వివరించారని.. మా మైండ్ బ్లాక్ అయిపోయింది అంటూ చెప్పుకొచ్చాడు. సినిమా ఎక్కడికో వెళ్లిపోయిందని.. అంత అద్భుతంగా ఉందని.. 12 గంటలకు మేము స్టోరీ సిటింగ్ లో కూర్చుంటే.. మధ్యాహ్నం 3 గంటలు అయిందని.. కేవలం ఫస్ట్ హాఫ్ నీ వివరించడం కోసం ఆయన ఇంత సమయం తీసుకున్నాడు. అప్పటికే తను బాగా అలసిపోయాడు అంటూ వివరించాడు.

Rajamouli's SSMB29 Hyderabad Reveal with Mahesh, Priyanka - India Weekly

సెకండ్ హాఫ్ వింటాం లెండి సార్.. రిలాక్స్ అవ్వండి అని మేమే చెప్పాం. బాహుబలి లాంటి సినిమాకు మళ్ళీ లైఫ్ లో ఒక్కసారైనా పని చేస్తే చాలని అనుకున్నా. కానీ.. ఈ స్టోరీ బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ సినిమాలకు మించి ఉంటుంది. ఎన్ని అంచనాలు పెట్టుకున్న అందుకొనే కెపాసిటీ ఉన్న కథ‌ అంటూ శంకర్ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే.. తాజాగా గ్లోబల్ ట్రోట‌ర్ స్టోరీ ఇదే అంటూ ఓ కథ‌ తెగ వైరల్‌గా మారుతుంది. ప్రపంచం మొత్తం టూర్ వేసిన ఓ యువకుడు.. ఎలాంటి ప్రాంతాలకైనా వెళ్లి తిరిగి రాగల వ్య‌క్తిగా మహేష్ కనిపిస్తాడు. విలన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్‌.. చాలా పవర్ఫుల్.

SSMB 29 launch: SS Rajamouli's film with Mahesh Babu kicks off with pooja  amid confusion over Priyanka Chopra's casting | Hindustan Times

కొన్ని కారణాలవల్ల తన కాళ్లు చేతులు పడిపోయాయి.. మళ్ళీ ఆయనకు పూర్వ వైభవం కావాలంటే మృత సంజీవని దక్కించుకోవాలి. అది దక్షిణాఫ్రికాలోని ఒక క్రూరమైన అడవిలో మాత్రమే ఉంటుంది. అక్కడకు సాధారణ మనుషులు వెళ్లలేరు. అలాంటి ప్రాంతాన్ని ప్రపంచం మొత్తం చుట్టేసిన మహేష్ మాత్రమే చుట్టి రాగలరని.. అతని వెతికి పట్టుకొని తీసుకువస్తాడు కుంభ. ఆ తర్వాత జరిగే పరిణామాలే అసలు స్టోరీ. అనుకున్నది అనుకున్నట్లు వస్తే మాత్రం సినిమా హాలీవుడ్‌కు స్ట్రాంగ్ పోటీ ఇస్తుంది అనడంలో సందేహం లేదు. మరి సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.