” కన్నప్ప ” ఫుల్ రివ్యూ.. విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ హిట్టా.. పట్టా..!

టాలీవుడ్ క్రేజి హీరో మంచు విష్ణు ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన తాజా మూవీ కన్నప్ప. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా.. విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్టుగా రూపొందింది. అవా ఎంటర్‌టైన్మంట్స్‌, 24 ఫ్రెమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్ల పై సంయుక్తంగా రూపొందిన ఈ భారీ బడ్జెట్ మూవీ.. కొద్ది గంటల క్రితం గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. సినిమాపై రిలీజ్ కు ముందే ఆడియన్స్‌లో మంచి అంచనాలను నెలకొన్నా.. అక్కడక్కడ నెగటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో కొద్ది గంటల క్రితం గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన క‌న్న‌ప్ప‌.. ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలు ముగించుకొని.. పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇంతకీ సినిమా ఆడియన్స్‌ను ఎలా మెప్పించింది.. ఏ రేంజ్ లో ఆకట్టుకుంది.. ఒకసారి రివ్యూ లో చూద్దాం.

కథ:
సినిమా మొత్తం తిన్న‌డు.. నాస్తికుడి నుంచి కన్నప్పగా ఎలా మారాడనే బ్యాక్ డ్రాప్ తో రూపొందిన సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ సినిమాలో శివుడు పాత్రలో మెరువగా.. కాజల్ పార్వతి దేవిగా నటించింది. విష్ణు ప్రధాన పాత్ర తిన్నాడు రోల్‌లో మెరిసాడు. మొదటి భాగం అంతా తిన్నాడు బ్యాక్గ్రౌండ్ స్టోరీ తోనే సాగింది. ఈ సినిమాలో మోహన్ లాల్ చేసిన స్పెషల్ రోల్ ఆడియన్స్‌కు మంచి మంచి సర్ప్రైజ్‌. ప్రభాస్ రుద్ర పాత్ర ఎంట్రీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. నాస్తికుడుగా ఉన్న తినడు మహా భక్తుడిగా కన్నప్పగ మారిన‌ సన్నివేశాలు నెక్స‌ట్ లెవెల్ ఇవి చూడాలంటే ధియేట‌ర్‌కు వెళ్లాల్సిందే.

రివ్యూ
ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కథ కష్ట స్లోగా అనిపించింది. మొదటి భాగం బోరింగ్ గా మరియు.. పిల్లర్ లాగా ఆడియన్స్‌కు ఫీల్ క‌లుగుతుంది. మంచు విష్ణు నటన ఆకట్టుకుంది. అక్కడక్కడ తిన్నాడు లవ్ స్టోరీ, రొమాంటిక్ సీన్స్ అవసరమైన యాక్షన్ సీన్స్ లో డైరెక్టర్ కాస్త లాగ్ చేసిన పీల్ కలుగుతుంది. ఇక ఫస్ట్ హాఫ్‌ స్టోరీ అంతా స్లోగా అనిపించడం.. సినిమాకు పెద్ద మైనస్. సెకండ్ హాఫ్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. సెకండ్ ఆఫ్ మొదలైన కొద్దిసేపటికే ఈ సీన్స్ లో మంచు విష్ణు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా నటనను కనబరిచాడు.

Kannappa :విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌ "కన్నప్ప"తో మంచు వారసుడు అరంగేట్రం - తెలుగు News - IndiaGlitz.com

ఇక రుద్రుడిగా ప్రభాస్ ఎంట్రీ నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్‌కు వెళ్ళింది. మూవీ భక్తి సన్నివేశాలతో నిండిపోయింది. సినిమా గ్రాఫ్‌ అంతకు అంతకు పెరుగుతూ వచ్చిందన‌టంలో అతిస‌యోక్తి లేదు. ఇక క్లైమాక్స్ చివరి 40 నిమిషాలు అంద‌రిని మెప్పిస్తుంది.. తిన్న‌డు నుంచి క‌న్న‌ప్ప‌గా మారిన తీరు అలాగా ఓ ఇంట్ర‌స్టింగ్‌ విష‌యాని ఈ మూవీలో రివీల్ చేశారు. ఒక మాటలో చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ లో పిల్లర్గా అనుకొని వదిలేస్తే.. సెకండ్ హాఫ్ మాత్రం సినిమాకు హైలెట్గా నిలిచింది.

న‌టీన‌టుల ప‌ర్ఫార్మెన్స్‌
తిన్నడిగా మంచు విష్ణు నటనతో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాడు. ఈ సినిమాతో విష్ణు నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రభాస్ ఎప్పటిలాగే తన పాత్రలో ఒదిగిపోయాడు. రుద్రగా ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. అక్షయ్ కుమార్, కాజల్, మోహన్‌లాల్, మోహన్ బాబు ఇలా సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ ఎవరి పాత్రలో వాళ్ళు 100% ఎఫర్ట్స్‌ ఇస్తూ ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

Kannappa teaser: Prabhas, Akshay Kumar steal the show in mythological tale | Bollywood - Hindustan Times

టెక్నిక‌ల్‌గా
సినిమాలో ఉండే ప్రతి ఒక్క భక్తి సాంగ్, మ్యూజిక్, లిరిక్స్, విఎఫ్ అందరిని ఆకట్టుకునేలా డిజైన్ చేశారు. నిర్మణ‌ విలువలు బాగున్నాయి. సినిమాల్లో చూపించిన లొకేషన్స్ నెక్స్ట్ లెవెల్. ఇక కాళహస్తి అలాగే కన్నప్ప ప్రాముఖ్యతలను చాలా అందంగా సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారు.

ఫైన‌ల్‌గా
ఇక సినిమాలో బిగ్గెస్ట్ మైనస్ ఏదైనా ఉందంటే పిల్లర్ ఫస్ట్ హాఫ్.. దాన్ని వదిలేస్తే.. సినిమాలో వచ్చే భక్తి పాటలు, సినిమా కోసం నటినట్లు పడిన కష్టం, క్టైమాక్స్ కోసమైనా సినిమాను ఒక‌సారి చూడొచ్చు.