స్టార్ హీరోస్ మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జునలకు ఎలాంటి క్రేజ్.. పాపులర్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా డ్యాన్సులతో అదరగొడుతూ.. యావత్ సినీ ఇండస్ట్రీని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. తన నెక్స్ట్ సినిమాలకు ఎలాగైనా బ్లాక్ బస్టర్లు కొట్టాలని కష్టపడుతున్నాడు చిరు. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్లో కామెడీ ఎంటర్టైనర్లో నటిస్తూ.. ఫుల్ జోష్‌లో సందడి చేస్తున్నాడు. ఇక.. అక్కినేని నాగేశ్వరావు నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున సైతం సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే.
వైవిధ్యమైన కథలను ఎంచుకొని సక్సెస్ కొట్టడంలో నాగార్జున మొదటి వరుసలో ఉంటాడు. నాగార్జునకు, చిరంజీవికి మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే వీళ్లిద్దరూ.. పలు సందర్భాల్లో వారి రిలేషన్షిప్ గురించి పరోక్షంగా అభిమానులకు రివీల్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. తాజాగా నాగార్జున కీలక పాత్రలో నటించిన కుబేర సక్సెస్ మీట్లో చిరంజీవి సందడి చేసి నాగార్జున పై ప్రశంసలు కురిపించాడు. ఈ క్రమంలోనే గతంలో వీళ్ళిద్దరికీ కాంబోలో ఓ సూపర్ హిట్ మూవీ మిస్ అయిందట.
ఇక గతంలో వీళ్ళిద్దరి కాంబోలో సినిమా వస్తుందంటూ వార్తలు వినిపించినా.. అది సెట్స్‌పైకి రాకముందే ఆగిపోయిందట. ఇంతకీ ఆ మూవీ ఏంటో.. అసలు డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇద్దరు స్టార్ హీరోలను కలిపి ఇ.వి.వి సత్యనారాయణ ఓ భారి సబ్జెక్ట్‌ను చేయాలని ప్లాన్ చేశాడట. అప్పుడున్న పరిస్థితులను బట్టి.. వీళ్ళిద్దరి స్టార్ ఇమేజ్ను మ్యాచ్ చేసే విధంగా కథ సెట్ కాకపోవడంతో.. ఈ ప్రాజెక్టును వదిలేసారు. ఏదేమైనా ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే కచ్చితంగా సినిమాపై ఆడియన్స్ లో కనీవినీ ఎరుగని రేంజ్లో అంచనాలు నెలకొంటాయి అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే ఫ్యూచర్లో అయినా వీళ్ళిద్దరి కాంబోలో మంచి మల్టీ స్టారర్ తెరకెక్కి సక్సస్ అందుకుంటుందో.. లేదో.. వేచి చూడాలి.