‘ కుబేర 3 ‘ డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్‌కు మరి ఇంత దూరమా..!

కొలీవేడ్‌ స్టార్ట్ ధనుష్ హీరోగా.. మ్యాజికల్ డైరెక్టర్ శేఖర్ కమ్యుల డైరెక్షన్‌లో రూపొందిన తాజా మూవీ కుబేర. బాక్స్ ఆఫీస్ దగ్గర జైత్రయాత్రను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ట్రేడ్ వర్గాలు కూడా ఊహించని రేంజ్‌లో వసూళ్లు కొల్లగొడుతూ అందరికి షాక్‌ను కలిగిస్తున్న కుబేర.. థియేటర్లు కళకళలాడేలా చేసింది. ఫస్ట్ డే.. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. మౌత్ టాక్‌కి తగ్గట్టుగానే.. మూడు రోజుల్లో ఏకంగా రూ.80 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు.. రూ.40 కోట్ల షేర్ వసూళ్లును కొల్లగొట్టి సంచాలనం క్రియేట్ చేసింది. ఇక.. మరో రూ.25 కోట్లు వస్తే చాలు.. సినిమా బ్రేకి ఈవెన్ అయ్యి లాభాల్లోకి అడుగుపెడుతుంది. ఇక.. నిన్న వర్కింగ్ డే అయినా కూడా.. డీసెంట్ లెవెల్‌లో కలెక్షన్లు హోల్డ్ చేస్తూ అన్ని ప్రాంతాల్లో కుబెర దూసుకుపోతుంది.

Kuberaa Worldwide Box Office Collection Day 3 Prediction: Dhanush And Nagarjuna's Movie Set To Cross ₹80 Crore - Filmibeat

కనుక.. మొదటి వారం ముగిసేలోపు సినిమా బ్రేక్ ఈవెన్ దాటేస్తుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మూడు రోజుల రూ.21కోట్లు 81ల‌క్ష‌ల‌ షేర్ వ‌సూళ్లు రాగా.. రూ.37 కోట్ల 45 లక్షల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక.. ప్రాంతాలవారీగా కుబేర షేర్ వ‌సూళ్ల‌ లెక్కలు ఒకసారి చూద్దాం. నైజం లో రూ.9 కోట్ల 20 లక్షల షేర్ వసూలు వస్తే.. సీడెడ్ లో రూ.2కోట్ల 76లక్షలు, ఈస్ట్ గోదావరి కోటి 64 లక్షలు, ఉత్తరాంధ్ర రూ.3 కోట్లు 31లక్షలు, వెస్ట్ గోదావరి కోటి 11 లక్షలు, గుంటూరులో కోటి 49 లక్షలు, కృష్ణాజిల్లా కోటి 51 లక్షలు, నెల్లూరు 79 లక్షలు షేర్ వ‌సూళ్లు దక్కాయి. అంటే.. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కలెక్షన్ల పరంగా గ్రాండ్ లెవెల్‌లో సంచలనం సృష్టించింది.అయితే.. ధనుష్‌ కోలీవుడ్ హీరో అయినా.. అక్కడ మాత్రం కనీసం బిలో యావరేజ్ రేంజ్ వసూళ్లును కూడా అందుకోలేక పోతుంది.

Kubera Movie News

కుబేర.. మూడు రోజులకు కలిపి తమిళనాడులో కేవలం రూ.13 కోట్ల 45 లక్షలు మాత్రమే వసూలు వచ్చాయి. అలాగే కర్ణాటకలో రూ.6 కోట్ల 12 లక్షలు, కేరళలో 73 లక్షలు, హిందీలో కోటి 40 లక్షలు, ఓవర్సీస్‌లో 21 లక్షల గ్రాస్ వ‌సూళ్లు దక్కాయి. ఓవరాల్‌గా.. సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ.80 కోట్లు రావడం విశేషం. ఇక.. ఓవర్సీస్‌లో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న కుబేర.. నార్త్ అమెరికాలో మరింత లాంగ్ ర‌న్‌లో కొనసాగే ఛాన్స్ కనిపిస్తుంది. సోమవారం కూడా ఈ సినిమాకు ప్రధాన ప్రాంతాల్లో ఫస్ట్ షో, సెకండ్ షోస్ హౌస్ ఫుల్‌గా నిలిచాయి. ఈ క్రమంలోనే కుబేర కేవలం ఒక నార్త్ అమెరికాలోనే మూడు మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చేలా కనిపిస్తుందంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.