నాగార్జున నాకు దారిచూపించాడంటోన్న చిరంజీవి..?

ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న సీనియర్ హీరోలు ఓవైపు హీరోలుగా నటిస్తూ.. మరో పక్క అవకాశం వచ్చినప్పుడు ఇతర హీరోల సినిమాల్లో బలమైన పాత్రలో నటించడానికి వెనుకడుగు వేస్తూ ఉంటారు. కానీ.. వెంకటేష్ మాత్రం ఎప్పటినుంచో ఆ దారిని ఎంచుకొని రాణిస్తున్నాడు. ఓ బైపు హీరోగా చేస్తున్నా.. మ‌రోవైపు మ‌ల్టీస్టార‌ర్ సినిమాల్లోనూ మెరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలతో మంచి సక్సెస్ సైతం అందిపుచ్చుకుంటున్నాడు. కమలహాసన్ కూడా చాలా కాలంగా పలు సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్‌లో నటిస్తున్నాడు. కల్కి 2898 ఏడిలో కమలహాసన్ ఇలాంటి పాత్రలోనే మెరిసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కుబేరతో.. నాగార్జున కూడా సినిమాల్లో కీలకపాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు.

Nagarjuna Shared His Inside Emotion And Respect On Chiranjeevi At Kubera  Movie Success Meet | Stv - YouTube

ఈ మూవీలో దీపక్ పాత్రలో మెరిసిన నాగ్ తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నాడు. ఇక కూలీ మూవీలో సైతం నాగ్ ఓ కీలకపాత్రలో మెరవనున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా అదే దారిలో నడవడానికి సిద్ధమైనట్లు అనౌన్స్ చేసాడు. కుబేర సక్సెస్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ.. నాగార్జున నాకు దారి చూపాడ‌ని.. నేను కూడా అతని మార్గంలోనే రావచ్చు అంటూ చెప్పుకొచ్చాడు. రేపొద్దున్న ఇలాంటి బలమైన పాత్రలు.. డిఫరెంట్ రోల్స్ వస్తే.. ఓటీటీలకైనా, సినిమాల్లోనైనా నటించే అవకాశం ఉందని.. నేను కూడా నటిస్తానంటూ చిరంజీవి వివరించాడు. నాగార్జునను.. నేను చాలా విషయాల్లో స్ఫూర్తిగా తీసుకుంటా. గ్లామర్, ఫిట్‌నెస్‌. కూల్ ఆటిట్యూడ్ ఇలా అన్నింటిలోనూ నాకు ఆయన మంచి స్ఫూర్తి. మాకు కెప్టెన్ లాంటివాడు.ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్ చేసే విషయంలోనూ నాగార్జున నాకు ఇన్స్పిరేషన్ గా మారాడని చిరంజీవి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.

MOVIE VOLUME UNCUT - Kuberaa Success Meet | Chiranjeevi | Nagarjuna |  Dhanush | Rashmika - YouTube

కుబేర సక్సెస్ ఈవెంట్ కు వచ్చిన చిరంజీవి వేదికపై ఈ విషయాలను పంచుకోవ‌డం నాగ్ ఫ్యాన్స్‌కు మ‌రింత కిక్ ఇచ్చింది. ఇక నాగార్జునను ఈ సినిమాకు ముందు ఒకసారి కలిసా.. కుబేర గురించి అడిగినప్పుడు ఇందులో డిఫరెంట్ క్యారెక్టర్ లో చేస్తున్నా.. ధనుష్ లీడ్ క్యారెక్టర్ అని వివరించాడు. ఎలా ఒప్పుకున్నావు అని అడిగితే.. నాకు ఎక్కడో డిఫరెంట్ గా చేయాలని ఉంది. కొత్త గేట్స్ ఓపెన్ చేయాలని ఉంది. అలా.. ఈ సినిమా ఉపయోగపడుతుంది అంటూ నాగార్జున చెప్పారు. నేను సినిమా చూశా. ఆయన చెప్పింది 100% నిజం. ఈ సినిమా తర్వాత ఆయన మరో 40 ఏళ్లు ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్గా రాణిస్తాడు అనేది వాస్తవం. ఈ క్యారెక్టర్ శేఖర్ రాయడం అది నాగార్జున ఒప్పుకోవడం కచ్చితంగా మంచి సక్సెస్ గా భావిస్తున్న అంటూ చిరంజీవి వివరించాడు.