మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా గ్రాండ్ లెవెల్ లో జరిగింది. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో విష్ణు మాట్లాడుతూ.. ప్రభాస్ పై ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. ప్రభాస్ స్నేహం గురించి ఆయన గొప్పతనం గురించి వివరించాడు. స్నేహితుల రెండు రకాల వ్యక్తులు ఉంటారని.. అందులో ఒకరు కృష్ణుడు లాంటి వారు.. కాగా మరొకరు కర్నుడు లాంటి వాళ్ళు. నేను, ప్రభాస్ కూడా సేమ్ అలాగే. నా లైఫ్ లో ప్రభాస్ కృష్ణుడు అయితే.. నేను తన అర్జునుడిని.. ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లోనే కాదు.. పాన్ వరల్డ్ రేంజ్ లో పెద్ద స్టార్. అతనికి నా సినిమా చేయాల్సిన అవసరం లేదు. కానీ.. నా తండ్రి మోహన్ బాబు మీద ఉన్న ప్రేమ, గౌరవం, అభిమానంతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. నటించాడు.
ఈ విషయంపై నేను పదే పదే ప్రభాస్‌ను ఆటపట్టిస్తా. నువ్వు నాకోసం కాదులే.. మా నాన్న కోసం సినిమా ఒప్పుకున్నావు అని చెప్తా. తను కూడా కాంప్రమైజ్ కాడు. నిజమే.. నీకోసం కాదు మా బావ కోసమే సినిమా చేస్తున్నా అంటాడు.. అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ప్రభాస్ అభిమానులకు నేను చెప్పేది ఒకటే. ఆయన గొప్ప మానవతావాది. కొందరు కొద్దిగా డబ్బు, ఫేమ్ వస్తే చాలు.. రకరకాలుగా మారిపోతుంటారు. కానీ.. ప్రభాస్ ఎంత ఎదిగిన ఆయనలో మాత్రం ఇవేవీ కనిపించవు. చాలా మంచి వ్యక్తిత్వం. అలాంటి వ్యక్తి ఇండస్ట్రీలో ఉండడం అందరికీ గర్వకారణం అంటూ మంచు విష్ణు కామెంట్స్ చేశాడు.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారుతుంది. ఇక ఈ మూవీ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ దర్శకత్వం వహించగా.. మోహన్ బాబు, శరత్ కుమార్, మోహన్ లాల్, మ,ధు ముకేష్, ప్రీతి, అక్షయ్ కుమార్, కాజల్, ప్రభాస్ లాంటి స్టార్ కాస్టింగ్ అంత కీలక పాత్రలో చేశారు. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కినట్లు సమాచారం. ఇక విష్ణు.. ఆశలన్నీ కన్నప్ప పైనే పెట్టుకున్నాడు. ఈ సినిమా ఖచ్చితంగా మంచి సక్సెస్ అవుతుందని బిలీవ్ చేస్తున్నాడు. మరి.. సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.