టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరి కాంబోలో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో ఇప్పటికే ఆసక్తి నెలకొంది. సెట్స్‌పైకి రాకముందే ఆడియన్స్‌లో భారీ అంచనాలను నెలకొల్పుతుంది. అటు పుష్ప 2 మూవీతో ప్రపంచవ్యాప్తంగా బన్నీ క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇక జవాన్‌తో బాలీవుడ్ ఇండస్ట్రీని అట్లీ షేక్ చేసి వదిలారు. ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబోలో రానున్న ప్రాజెక్ట్ కావడంతో.. ఆడియన్స్‌లో మరింత ఆసక్తి మొదలైంది.
ఇక.. ఈ కాంబోపై అఫీషియల్ ప్రకటన వచ్చిన దగ్గరనుంచి.. రోజుకో న్యూస్ చెక్కర్లు కొడుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. అదేంటంటే.. గతంలో నాని లవర్ గా నటించిన ఓ ముద్దుగుమ్మ.. ఇప్పుడు బన్నీ సిస్టర్ రోల్ లో కనిపించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ మూవీలో కథను మలుపు తిప్పే పాత్ర కూడా ఆమెదేనని సమాచారం. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు మలయాళ సోయగం నజ్రియా నజీమ్. తను నటించబోయే ఆ పాత్ర చాలా ఎమోషనల్‌గా ఉండనుందట. ఇక ఇప్పటికే అట్లీ.. బన్నీకోసం పవర్ ఫుల్ స్క్రీప్ట్ పూర్తి చేశాడని సమాచారం.
మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓ డాన్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇక ఈ మూవీ బన్నీ పవర్ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ రోల్ లో కనిపించనున్నాడట. సన్ పిక్చర్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు తాజాగా ముగిస్తాయి. త్వరలోనే సినిమా సెట్స్ పైకి రానుంది. కాగా ఇప్పటివరకు స్టార్ హీరోయిన్గా మంచి క్రేజ్ సంపాదించుకున్న నజ్రియా.. బన్నీ పక్కన సిస్టర్ రోల్ అని తెలియడంతో అమ్మడి ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు హీరోయిన్గా రాణించిన ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్ స్టార్ హీరోల సరసన్నా హీరోయిన్ గా కనిపిస్తుంది అనుకుంటే.. ఇలాంటి పాత్రలకు ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.