సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు పలు సినిమాల్లో నటించి.. స్టార్ హీరోలుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న తర్వాత.. ఏవో కారణాలతో ఇండస్ట్రీకి దూరమై తర్వాత రీఎంట్రీతో సినిమాల్లో మెరిసిన హీరోలు ఎంతోమంది ఉన్నారు. కొంతమంది మరోసారి హీరోలుగానే రీ ఎంట్రీ ఇస్తే.. మరి కొంతమంది మాత్రం కీలక పాత్రల్లోను.. విలన్ పాత్రలోనూ నటించి ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఈ నటుడు కూడా ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణించాడు. తర్వాత.. పలు కారణాలతో ఇండస్ట్రీకి దూరమైన ఆయన.. ఇప్పుడు మరోసారి విలన్గా రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇంతకీ ఈ పై ఫోటోలో కనిపిస్తున్న హీరో ఎవరో గుర్తుపట్టారా.. అతనే వడ్డే నవీన్. ఈయనకు టాలీవుడ్ ఆడియన్స్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 2000 కాలంలో తన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న వడ్డే నవీన్.. ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ వడ్డే రమేష్ కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.
1996లో వచ్చిన క్రాంతి సినిమాతో టాలీవుడ్ పరిచయమైన నవీన్.. తర్వాత కోరుకున్న ప్రియుడు, పెళ్లి, మనసిచ్చిచూడు, లవ్ స్టోరీ 1999, స్నేహితులు లాంటి సినిమాల్లో నటించి మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక నవీన్ నటించిన అన్ని సినిమాల్లోనూ 1997లో రిలీజ్ అయిన పెళ్లి సినిమాతో ఒక్కసారిగా భారీ పాపులారిటీ దక్కించుకున్నాడు. నవీన్ ఈ సినిమాతో వరుస ఆఫర్లను అందుకున్నాడు. మా బాలాజీ, చాలా బాగుంది, చెప్పాలని ఉంది, అయోధ్య, ఆదిలక్ష్మి ఇలా పలు సినిమాల్లో నటించి హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 2016 లో వచ్చిన ఎటాక్ సినిమా తర్వాత ఇండస్ట్రీకి దూరమైన నవీన్.. అప్పటినుంచి ఇప్పటివరకు మళ్ళీ స్క్రీన్ పై కనిపించిందే లేదు. అలా దాదాపు 9 ఏళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా.. తాజాగా రీ ఎంట్రీకి సిద్ధమయ్యాడంటూ న్యూస్ నెటింట వైరల్గా మారుతుంది. అయితే.. ఇంతకీ ఆ సినిమా డైరెక్టర్ ఎవరు.. సినిమా పేరేంటి.. ఇంకా రివీల్ కాలేదు.
కానీ.. ఒక కొత్త డైరెక్టర్ రూపొందించబోతున్న టైటిల్ పెట్టని సినిమా కోసం.. వడ్డే నవీన్ విలన్ గా రీ ఎంట్రీ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అంతేకాదు.. ఈ సినిమాతో కొత్త హీరో కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఈ కొత్త డైరెక్టర్, కొత్త హీరోతో కలిసి వడ్డే నవీన్ సినిమా చేస్తున్న నేపథ్యంలో.. ఈ న్యూస్ మరింత హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే.. దాదాపు 9 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న నవీన్.. హీరోగా కాకుండా విలన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఇక ఇప్పటికే ఓ జనరేషన్లో హీరోలుగా నటించిన ఎంతోమంది తర్వాత విలన్ పాత్రలో నటించి ఆకట్టుకుంటున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. కాగా.. అసలే కొత్త హీరో, కొత్త డైరెక్టర్ తో వస్తున్న సినిమా కావడంతో.. ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకోబోతుందో.. వడ్డే నవీన్ కం బ్యాక్ ఎలా ఉండబోతుందో.. అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.