టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుని రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఎస్ఎస్ఎంబి 29 సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేశాడు మహేష్. ఈ సినిమాతో ఏకంగా పాన్ వరల్డ్ మార్కెట్‌ను టార్గెట్ చేశాడు రాజమౌళి. కాగా.. ప్రస్తుతం ఈ రేంజ్‌లో దూసుకుపోతున్న మహేష్.. కెరీర్ ప్రారంభంలో అడపాదడపా సక్సస్‌లను అందుకుంటూ వచ్చిన మహేష్.. ఒకడు, అతడు, పోకిరి లాంటి సినిమాలతో భారీ సక్సెస్‌లు తన ఖాతాలో వేసుకుని తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. కాగా.. మహేష్ కెరీర్‌లో తాను నటించిన సినిమా అంటే మహేష్‌తో పాటు.. అభిమానులకు కూడా అసలు నచ్చదట.
ఇంతకీ ఆ మూవీ ఏదో.. దాని వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. మహేష్ బాబు కెరీర్ ప్రారంభంలో యువరాజు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. వైవిఎస్ చౌదరి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాలో ప్రతిజింటా, సిమ్రాన్ హీరోయిన్‌లుగా మెరిశారు. మహేష్ బాబు ఈ సినిమాలో.. ఓ పిల్లాడి తండ్రిగా కనిపిస్తాడు. అప్పుడప్పుడే ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్.. అంత పెద్ద క్యారెక్టర్ ను సెలెక్ట్ చేసుకోవడం అభిమానులకు నిరాశ కల్పించిందట. అంతేకాదు.. మహేష్ బాబు కూడా చాలా సందర్భాల్లో ఈ క్యారెక్టర్ ను సెలెక్ట్ చేసుకున్నందుకు ఫీలయ్యాడట.
ఏదైనా కెరీర్ ప్రారంభంలో ఓ మంచి సక్సెస్ రావడానికి వైవిఎస్ చౌదరి లాంటి దర్శకులు హెల్ప్ అవసరం అనే ఉద్దేశంతో మహేష్ సినిమాను చేశాడు. కానీ.. ఆ సినిమా తేడా కొట్టడంతో అప్పటినుంచి.. ఇప్పటివరకు మహేష్ మరోసారి పిల్లాడి తండ్రి పాత్రలో నటించే సాహసం చేయలేదు. ఎందుకంటే.. అలాంటి పాత్రలో తనని ఎవరు చూడలేరని ఆయనకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అందుకే ఇప్పటివరకు అలాంటి పాత్రలు నటించలేదు మహేష్. ఇక.. ప్రస్తుతం మహేష్.. ఎస్ఎస్ఎంబి 29 షూట్‌లో బిజీబిజీగా గడుపుతున్నాడు. కాగా.. ఈ సినిమా పై ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఇక.. ఈ సినిమాతో యావత్ సినీ ఇండస్ట్రీని మహేష్, జక్కన్న మెప్పిస్తారా.. లేదా.. ప్రపంచ స్థాయి హీరోగా మహేష్ మార్కెట్ పెరుగుతుందో లేదో చూడాలి.