బాలయ్యకు భార్యగా, ప్రేయసిగా, తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఎవరంటే..? 

నందమూరి నట‌సింహం బాలకృష్ణ కు ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వయసు పెరుగుతున్న కొద్ది క్రేజ్ ను మరింతగా పెంచుకుంటూ పోతున్న బాలయ్య.. ఈ జనరేషన్ యూత్ ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా మారాడు. ట్రెండ్‌కు తగ్గట్టుగా తనను తాను మార్చుకుంటూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు బాలయ్య. హీరోగానే కాదు.. టాక్‌షోతో హోస్ట్ గాను, మరొ ప‌క్క రాజకీయాల్లోనూ తన సత్తా చాటుకుంటున్నాడు.

Chennakesava Reddy Telugu Movie | Bala Krishna, Shriya, Tabu, Devayani | Full Length Movie

ఇక ఒకప్పుడు ఇండస్ట్రీలో బాల‌య్య సినిమాకు రూ.25 కోట్ల మార్కెట్ కూడా లేని స్టేజ్ నుంచి.. ఇప్పుడు మొదటి రోజే రూ.50 కోట్ల గ్రాస్ వ‌సుళ‌ను కొల్లగొట్టే రేంజ్‌కు బాల‌య్య ఎదిగాడు. వరుసగా నాలుగు సినిమాలతో సక్సెస్‌లు అందుకున్నాడు. నాలుగు సినిమాలు రూ.100 కోట్ల క్లబ్ లో చేరి సంచలనం సృష్టించాయి. అలా బాలయ్యకు ప్ర‌జెంట్ ఓ పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో రేంజ్‌లో కలెక్షన్లు వస్తుండడం విశేషం. ఈ క్రమంలోనే ప్రస్తుతం బాలయ్య.. అఖండ లాంటి బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్‌గా అఖండ 2లో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు.

Drishyam' Star Tabu Becomes A Hot Fruit Ninja In Sensual Telugu Song, 'Prem Valambanam'

బాలయ్య కెరీర్‌లోనే ఇది మొట్టమొదటి పాన్ ఇండియ‌న్‌ సినిమా కావడం విశేషం. ఇక ఈ సినిమాతో బాలయ్య మరెన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో వేచి చూడాలి. కాగా.. ఇలాంటిఈ నేపథ్యంలోనే బాలయ్యకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారుతుంది. గతంలో బాలయ్య సరసన ఓ ముద్దుగుమ్మ భార్యగా, తల్లిగా, లవర్ గా మూడు పాత్రలోను నటించి ఆకట్టుకుందంటూ న్యూస్ వైరల్ గా మారుతుంది. ఇంతకీ ఆమె ఎవరో కాదు సీనియర్ బ్యూటీ టబ్బు. ఈ అమ్మ‌డు గతంలో బాలయ్యకు భార్య‌గా, తల్లిగా, లవర్ గా మూడు పాత్రలను నటించి ఆకట్టుకుంది. చెన్నకేశవరెడ్డిలో భార్య గా.. చిన్న బాలయ్యకు తల్లి పాత్రను పోషించగా.. పాండురంగడు సినిమాలో లవర్ పాత్రలో మెరిసింది.