సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీల్ గా రాణిస్తున్న ఎంతోమంది వింత వింత వ్యాధులతో సఫర్ అవుతూ ఉంటారు. అలా ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలతో తమ్మకున్న రకరకాల వ్యాధుల గురించి రివీల్ చేశారు. అయితే తాజాగా రామ్‌చరణ్‌కు ఓ వింత వ్యాధి ఉందంటూ న్యూస్ నెటింట వైరల్‌గా మారుతుంది. అది కూడా.. జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించడం హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
వీరి మధ్య స్నేహం కంటే మించి మరింత దృఢమైన బంధుత్వం ఉంది. ఇక ఆ మంచి బాండింగ్ కారణంగానే వీరిద్దరి కాంబినేషన్లో భారీ పాన్ ఇండియన్ మూవీ ఆర్ఆర్ఆర్ తెరకెక్కింది. మల్టీ స్టారర్‌గా ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా ఏ రేంజ్లో సక్సెస్ అందుకుందో తెలిసిందే. ఇక త్వరలోనే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి గేమ్ ఛేంజర్ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. ఇలాంటి క్రమంలో రామ్‌చరణ్ గురించి తారక్ చేసిన సంచలన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. అయితే.. ఎన్టీఆర్ ఈ కామెంట్స్ ఇప్పుడు చేయలేదు.
గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన విషయాన్ని వెల్లడించాడు. ఇంతకీ ఆ వింత వ్యాధి ఏంటంటే రామ్ చరణ్ కు విపరీతమైన మతిమరుపట. ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ఓ ఇంటర్వ్యూలో చరణ్‌తో కలిసి పాల్గొన్న తారక్ మాట్లాడుతూ.. చరణ్ కు ఉన్న అతిపెద్ద వింత వ్యాధి మతిమరుపు అని.. ఆయన ఏదైనా వెంటనే మర్చి పోతూ ఉంటాడు అంటూ చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా షూటింగ్ సెట్లో పని చేసే వారి పేర్లు ఎన్ని సార్లు చెప్పిన గుర్తుండవని.. మళ్లీ వేరే వాళ్ళ పేరు పెట్టి వాళ్లను పిలుస్తూ ఉంటాడని చరణ్‌కు ఉన్న బలహీనత అది ఒకటే అంటూ వెల్లడించాడు. ప్రస్తుతం తారక్ చేసిన ఈ కామెంట్స్ వీడియో వైరల్ గా మారుతుంది.