టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరోగా.. డైరెక్టర్ శైలేష్ కొలన్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా మూవీ హిట్ 3. తెలుగు సిరీస్‌లో షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. విశ్వక్‌సేన్‌తో హిట్, అడవి శేష్‌తో హిట్ 2 సినిమాలను రూపొందించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న శైలేష్ కొలను.. నానితో ఈ సినిమా మూడో భాగాన్ని రూపొందిస్తున్నాడు. ఈ క్రమంలోనే సినిమా షూటింగ్ ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్‌లో జరుగుతుంది. అయితే ఈ మూవీ టీంలో.. యువ సినిమాటోగ్రాఫర్ కే. ఆర్. కృష్ణ(30) కూడా ఉన్నారు. ఆమె శ్రీనగర్‌లో జరుగుతున్న షూటింగ్లో పాల్గొంది.
అయితే ఒక్కసారిగా అస్వస్థతకు గురవడంతో హడావిడాగా హాస్పిటల్‌కు తరలించారు టీం. అక్కడ చికిత్స పొందుతూ కృష్ణా హర్ట్ ఎటాక్‌తో మృతి చెందింది. ఛాతిలో ఇన్ఫెక్షన్‌తో ఆమె మృతి చెందినట్లు సమాచారం. ఇక హిట్ 3 సినిమాకు మలయాళ డైరెక్టర్ సినిమాటోగ్రాఫర్ సాను వర్గీస్.. డిఓపిగా వ్యవహరిస్తున్నారు. కృష్ణ ఆయన అసోసియేటివ్ గా పని చేస్తుంది. ఈ క్రమంలోనే రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్‌లో షూటింగ్ తర్వాత జమ్మూకాశ్మీర్‌కు మూవీ టీం వెళ్లారు.
అక్కడ షూటింగ్ చేస్తున్న క్రమంలో అస్వస్థతకు గురవడంతో ఆమెను తీవ్ర జ్వరం కారణంగా ఈ నెల 23న.. శ్రీనగర్లో హాస్పిటల్కు తరలించగా ఆమె పరిస్థితి విషమించడంతో శ్రీనగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చికిత్స తీసుకున్న కృష్ణ కుటుంబ సభ్యులతోనూ ముచ్చటించారు. అయితే ఆసుపత్రిలో అమ్మే క్రమక్రమంగా కోలుకుంటున్న క్రమంలో.. హార్ట్ ఎటాక్ రావడంతో మృతి చెందింది. దీంతో టాలీవుడ్ లో విషాదం అలుముకుంది. హిట్ 3 బృందం, ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని జీర్నించుకోలేకపోతున్నారు.