అన్‌స్టాపబుల్ షోకు మెగా పవర్ స్టార్.. బాలయ్య, చెర్రీ కాంబో బ్లాక్ బస్టర్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. శంకర్ డైరెక్షన్లో రానున్న భారీ పాన్ ఇండియన్ మూవీ గేమ్ ఛేంజ‌ర్‌. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో జనవరి 10న రిలీజ్ కానుంది. ఈ క్ర‌మంలోనే.. సినిమా ప్రమోషన్స్‌జోరు పెంచారు మేకర్స్. ఇక.. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా రామ్ చరణ్ ప్రముఖ టాక్ షో బాలయ్య హోస్టిగా వ్యవహరిస్తున్న ఆన్‌స్టాపబుల్‌లో సందడి చేయనున్నారు. ఈ ఎపిసోడ్ షూట్ కోసం మంగళవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో రామ్ చరణ్ ప్రత్యక్షమయ్యాడు.

Ram Charan & Balakrishna Visuals @ Unstoppable Sets #Gamechanger #DakuMaharaaj | Manastars - YouTube

ఇక చరణ్‌తో పాటు.. బాలయ్య కూడా సెట్స్ లోకి వెళుతున్న పిక్స్, వీడియోస్ ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతున్నాయి. చ‌ర‌ణ్‌ కారులో నుంచి బయటకు దిగుతూ వేదికపై వస్తున్న ఫొటోస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారుతున్నాయి. ఇక ఇద్దరు హీరోలు కలిసిన నేపథ్యంలో రాంచరణ్ తో చేయగలిపిన బాలయ్య.. సంక్రాంతికి వస్తున్నాం అంటూ మీడియాకు వెల్లడించాడు. గేమ్ ఛేంజ‌ర్‌, డాకు మ‌హ‌రాజ్ రెండు సినిమాలు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం.. ఇదే మా ఆశయం అంటూ వెల్లడించాడు.

ఇక.. బాలయ్య అన్స్టాపబుల్ షో అంటే ఆ హీరోలకు సంబంధించిన సినిమాల విషయాలతో పాటు.. ఎన్నో పర్సనల్ ఇంట్రెస్టింగ్ విషయాలను కూడా బయటకు లాగుతాడు అన్న సంగతి తెలిసిందే. ఫ్యాన్స్‌కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే విధంగా బాలయ్య ప్రశ్నలు ఉంటాయి. ఈ క్రమంలోనే బాలయ్య.. రామ్ చరణ్ ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు. చరణ్ వాటికి ఎలాంటి సమాధానాలు ఇస్తారు.. తెలుసుకోవాలని ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. ఇక షోకు సంభందించిన వివరాలు తెలియాలంటే నెక్స్ట్ శనివారం ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే.