టాలీవుడ్ ఔకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న పుష్ప ట్రైలర్ రానే వచ్చేసింది. అందరూ అనుకున్నట్లుగానే ట్రైలర్ ఫైర్ తో నిండిపోయింది. పెద్దగా కథ రివీల్ చేయకపోయినా ట్రైలర్ కట్స్ తోనే ప్రేక్షకులు ఆసక్తి నెలకొల్పారు మేకర్స్. తొలిభాగంలో చాలామంది యాక్టర్స్.. ట్రైలర్‌లో కనిపించిన సంగతి తెలిసింది. అంతేకాదు సెకండ్ పార్ట్‌లో మరి కొంతమంది కొత్త నటులు కూడా యాడ్ అయ్యారు.
వీరిలో జాతరలో అరగుండుతో కనిపించిన ఓ పాత్ర అందరిలో ఆశక్తి కల్పించింది. ఇంతకీ ఆ నటుడు ఎవరో అని చాలామంది ఆలోచనలో పడ్డారు. ట్రైలర్లో అరగుండు, మెడలో చెప్పుల దండతో కనిపించిన ఈ నటుడే.. తారక్ పొన్నప్ప. కేజిఎఫ్ సినిమాతో కన్నడ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తారక్ పొన్నప్ప.. తాజాగా దేవరలో సైఫ్ అలీ ఖాన్ కొడుకు గానూ మెప్పించాడు.
పుష్ప 2లో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే గతంలో ఇంటర్వ్యూలో పుష్ప2లో చాలా ముఖ్యమైన పాత్రలు కనిపించానంటూ.. తారక్ పొన్నప్ప రివీల్ చేశాడు. నా క్యారెక్టర్ సినిమానే టర్న్ చేస్తుందని.. ట్విస్ట్ అదిరిపోతుందని.. పుష్ప లైఫ్ క్రేజీ టర్న్ తీసుకునే క్యారెక్టర్ నాది అంటూ చెప్పుకొచ్చాడు. ఇంతకీ.. తారక్ పోన్నప్ప చేసిన రోల్ ఏంటనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇంతకీ తారక్ పొన్నప్ప రోల్ ఏంటో.. సినిమాలో పుష్ప లైఫ్‌లో వచ్చే ఆ ట్విస్ట్ ఏంటో.. తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.