నాగార్జున, మహేష్ లైఫ్ స్టైల్ ఏంటో తెలుసా.. ఇద్దరూ అంత యంగ్ గా ఉండడానికి కారణం అదేనా..?

ప్రస్తుత లైఫ్ స్టైల్ లో అంత యేజ్ పెరిగినా యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్‌గా ఉండాలని తెగ ఆరాటపడుతున్నారు. హెల్తి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ తమ ఫిట్నెస్ను అలాగే ఉంచుకునేందుకు తాపత్రయపడుతున్నారు. వయసు మీద పడిన, వృద్ధాప్యం దగ్గర పడుతున్న దానిని యాక్సెప్ట్ చేయడానికి అసలు ఒప్పుకోవడం లేదు. వయసులో ఉన్నప్పుడు ఉన్నంత హుషారు, ఉత్సాహం ఎవరిలోనూ కనిపించదు. కనుక ఏజ్ పెరగాలని ఎవరు అసలు కోరుకోరు. అయితే సెలబ్రిటీస్ మాత్రం దీనికి పూర్తి భిన్నంగా రీ యేఏజ్‌నింగ్ స్టార్స్ గా ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ మరింత చిన్న వాళ్లల యంగ్‌, ఫిట్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్నారు.

Mahesh Babu Fans on X: "Superstar @urstrulyMahesh as College Student !  #Srimanthudu #Selvandhan @MythriOfficial @sivakoratala  http://t.co/opjpYb4YLL" / X

వారిలో నాగార్జున, మహేష్ బాబు కూడా ఉన్నారు. అలా మ‌న టాలీవుడ్ కింగ్ నాగ్‌కు ఇప్పటికే 65 ఏళ్లు వయసు మీద పడినా.. యంగ్ హీరోలా తన ఎనర్జితో, ఫిట్నెస్ తో ఆకట్టుకుంటున్నాడు. కుర్ర కారుకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇక మహేష్ బాబు ఐదుపదుల వయసులో ఏమాత్రం తరగని అందం ఫిట్నెస్తో ఆశ్చర్య పరుస్తున్నాడు. అయితే దాదాపు వాళ్ళ జనరేషన్ హీరోలుగా ఉన్న చిరు, బాలయ్య కు వృద్ధాప్యలు వచ్చినట్లు కనిపిస్తున్న.. నాగార్జున మాత్రం ఇప్పటికీ అలాగే యంగ్ లుక్ తో ఫిట్నెస్ తో కవ్విస్తున్నాడు. ఇక ఈ జనరేషన్ హీరోల్లో మహేష్ బాబు అందం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఐదు పదుల వైస్ దగ్గర పడుతున్ సినిమాల్లో కాలేజ్ స్టూడెంట్ పాత్రలో అందరినీ ఆకట్టుకున్నాడు. దానికి కార‌నం ఆయన గ్లామర్.

ఇప్పటికీ మహేష్ స్టూడెంట్ పాత్రలో నటిస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేసేస్తారు. అయితే వీరిద్దరి గ్లామర్ సీక్రెట్ ఏంటి.. అనే సందేహాలు కచ్చితంగా ఉంటాయి. ఓ సందర్భంలో నాగార్జున ఈ విషయాన్ని రివిల్ చేశారు. తన గ్లామర్ సీక్రెట్ బయటపెడుతూ.. అందరూ అనుకుంటున్నాట్టు ఎలాంటి డైటింగ్ చేయానని.. నచ్చిన ఫుడ్‌ కడుపునిండా తింటా. కాకపోతే ఆరోగ్యమైన లైఫ్ స్టైల్ ఫాలో అవుతా. ఉదయాన్నే ఎక్సర్సైజ్ వల్ల మెటబాలిజం పెరుగుతుంది. అది రోజంతా కంటిన్యూ అవుతుంది అంటూ చెప్పుకోవచ్చాడు. శరీరంలో ఎక్కువ క్యాలరీలను కరిగిస్తూ ఉంటానని నాగార్జున వెల్లడించారు.

Nagarjuna Akkineni (@iamnagarjuna) / X

రాత్రి 7 గంటలకు డిన్నర్ పూర్తి చేసేస్తా. బ్రౌన్ రైస్ తింటా. భోజనంలో మూడు ఆకుకూరలు కచ్చితంగా ఉండేలా చూసుకుంటా. ఫిష్, చికెన్ కూడా తింటా అంటూ వెల్లడించారు. ఇక ప్రతిరోజు రాత్రి స్వీట్ తినాల్సిందేనని చెప్పిన నాకు అది లేకుండా నాకు నైట్ నిద్ర పట్టదు అంటూ చెప్పుకొచ్చాడు. నెయ్యి కూడా బాగానే తీసుకుంటానని నాగార్జున వెల్లడించారు. క‌డుపుకు ఎప్పుడు ఆకలి తెలియనివ్వను. తనివి తీరా తింటా అంటూ చెప్పకొచ్చారు. ఇక మహేష్ బాబు తన బ్యూటీ సీక్రెట్ మితంగా తినడమేనని.. నాకు ఇష్టమైనది ఏదైనా తినేస్తా. కానీ లిమిట్‌లో తింటా. అతిగా తినేయను. పరిమితి మించి ఎప్పుడు తినాలని ప్రయత్నించను. అదే నా ఫిట్నెస్ సీక్రెట్ అంటూ చెప్పుకొచ్చాడు.