పుష్ప ది రూల్ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానుంది. మైత్రి మూవీస్ బ్యానర్ పై సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఓటీటీ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఇక తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ఏనుగు గీంకారంతో మొదలైన సంగతి తెలిసిందే. అడవిలో ఉండే అతి శక్తివంతమైన జంతువుల్లో ఏనుగు ఒకటి. విజయం సాధించినప్పుడు.. కథనరంగంలోకి దూకుతున్నప్పుడు.. శత్రు వర్గాల్లో భయం పుట్టించడానికి ఏనుగు గింకరిస్తుంది అంటారు. అంటే.. పుష్ప రాజు ఈ ప్రపంచంలో జరగబోయే యుద్ధానికి సిద్ధమన్నట్లు రిఫరెన్స్ గా సుకుమార్ హింట్ ఇచ్చారు అనిపిస్తోంది. వెంటనే కోగటం వీర ప్రతాపరెడ్డి పాత్రలో కనిపించిన జగపతిబాబు.. పుష్ప క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో వెల్లడించారు.
డబ్బంటే లెక్కలేదు.. పవర్ అంటే భయం లేదు.. వీడిలో తెలియని బాధ ఏదో ఉందంటూ చెప్పుకొచ్చాడు. దేన్నైనా పుష్పరాజ్ లెక్కచేయడనిజజ ఇక పుష్ప 1లో కొన్ని ఇంట్రెస్టింగ్ కట్స్ చూపించి.. నేరుగా అడవిలో పుష్ప డెన్‌కు సీన్ మార్చారు. పుష్ప రెండున్నర అక్షరాలే.. పేరు చిన్నది.. శబ్దం చాలా పెద్దది అంటూ పవర్ ఫుల్ డైలాగ్ వదిలారు. అక్కడి నుంచి అల్లు అర్జున్ ఎలివేషన్.. పాత్ర కనపడిన ప్రతి సీన్ పిక్స్ లెవెల్ లో ఉంది. పుష్ప అంటే పేరు కాదు పుష్ప అంటే బ్రాండ్ అంటూ శ్రీవల్లి చెప్పిన డైలాగ్ హెలికాప్టర్ తో దిగుతున్న బన్నీ షాట్స్ అదరగొట్టాయి. సాధారణంగా కూలీ జీవితాన్ని మొదలుపెట్టిన పుష్ప హెలికాప్టర్ తిరిగే రేంజ్‌కు ఎదిగాడని ఇంట్రెస్టింగ్‌గా చూపించారు.
శ్రీవల్లి నా పెళ్ళాం. పెళ్ళాం మాట మొగుడుంటే ఎట్టా ఉంటాదో చూపిస్తా అంటూ శ్రీవల్లి కాలుతో తన గడ్డం నిమిరే షాట్ చూపించారు. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది.. ఎవరిమాట వినని పుష్ప భార్య మాట ఎందుకు విన్నాడు అనే అంశాలపై ఇంట్రెస్ట్ కల్పించేలా ట్రైలర్ కట్ చూపించారు. అలాగే విలన్ గా భన్వర్‌సింగ్ షేకావత్ పాత్రను కూడా ఎలివేట్ చేశారు. రౌడీలు కొడితే పుష్పరాజ్ నీళ్లలో మునిగిపోతాడు. ఆ వెంటనే భన్వర్‌సింగ్ సెలయేర్ల నుంచి పైకి వస్తాడు. అర్రే దీవానో.. ముజే పహాచాను.. అంటూ అమితాబ్ డాన్ సినిమాలో సాంగ్ తో ఫాహద్ ఎంట్రీ చూపించారు. అంటే ఎవరి ఎక్స్పెక్టేషన్స్కు అందకుండా బన్నీకి గట్టి ప్రతి నాయకుడిగా ఫాహద్ ఉండబోతున్నాడని హింట్ ఇచ్చాడు సుకు.
అతని పాత్రను కూడా ఎంతో క్రూరంగా చూపించారు. పార్టీ ఉంది పుష్పం చెప్పే డైలాగ్ ఆడియన్స్లో మరింత ఆసక్తి నెలకొల్పుతుంది. నాకు రావలసిన పైసా ఏడుకొండల మీద ఉన్న.. ఏడు సముద్రాలు దాటైనా పోయి తెచ్చుకోవడం పుష్ప గాడికి అలవాటే అంటూ పుష్పరాజ్ యాక్షన్ సీన్ తో చెప్పే డైలాగ్.. డబ్బు కోసం ఎంత దూరమైనా వెళ్లే మనస్తత్వాన్ని చూపించింది. ఈ షాట్ లో హాస్యనటుడు సత్య కూడా కనిపించాడు. ఇక ఈ మూవీలో వన్ ఆఫ్ ది హైలెట్ తిరుపతి గంగమ్మ తల్లి జాతర. ఇప్పటికే దీనిపై ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలను నెలకొన్నాయి. ఇక ఈ జాతరలో కన్నడ నటుడు తారక్ పొన్నప్ప అరగుండుతో ప్రత్యక్షమయ్యాడు. అతని పాత్ర ఏంటి అనేది ఆడియన్స్ లో ఆసక్తి నెలకొల్పుతుంది.
శత్రువుకి శత్రువు మనకు మిత్రుడు అన్నట్లు అనువదిస్తూ డ్యాన్స్ చేస్తున్న షాట్లో.. సరిగ్గా చూస్తే మంగళం శీను, దాక్షాయిని కనిపించారు. అంటే అంతా ఒకటే పుష్ప రాజు పై పగబట్టి పుష్పను పడగొట్టే ప్లాన్ చేశారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే ఇదే షార్ట్.. మరో మహిళ ఇంట్రెస్టింగ్ గా కనిపించింది. ఆమె ఎవరనేది సినిమాలో రివీల్ అవ్వాల్సిందే. ఇక ట్రైలర్లో ఆడియన్స్ లో మరింత ఆసక్తి కల్పించిన షార్ట్.. ఎర్రచందనం చెక్కల పై శవాన్ని తగలబెట్టడం. ఎంపీ సిద్ధప్ప నాయుడు నుంచి ఎంతోమంది పెద్దలు ఆ దహన సంస్కారాల్లో పాల్గొన్నారు. ఇంతకీ ఆ చనిపోయిన వ్యక్తి ఎవరన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఖచ్చితంగా ఇది సినిమాను మలుపు తిప్పే రోల్ అయి ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పుష్పపై పగతో రగిలిపోతున్న మరో క్యారెక్టర్ జాలిరెడ్డి. పార్ట్ 1లో పుష్ప చేతులో తన్నులు తిని సరైన టైం కోసం ఎదురుచూస్తున్న జాలి రెడ్డి ట్రైలర్ షాట్ లో గన్ గురి పెట్టినట్లు చూపించారు. ఇది పుష్ప పైనే అన్నట్లు క్లియర్ గా తెలుస్తుంది. మరి అవకాశం వచ్చినా ఎందుకు చంపకుండా వదిలేశాడు.. జాలి రెడ్డి భన్వర్‌సింగ్ షేకావత్తో చేతులు కలిపాడా.. లేదా.. అనే కన్ఫ్యూషన్ అభిమానుల్లో నెలకొంది. ఈ ప్రశ్నలన్నిటికీ సినిమా చూస్తే కానీ క్లారిటీ రాదు.