పవన్ ” ఓజీ “లో ఆఖీరా ఫిక్స్.. కానీ ట్విస్ట్ ఏంటంటే..?

ఏపీ డిప్యూటీ సీఎం టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడుగా ఆకిరానందన్ ఇండస్ట్రీలో ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే పవన్ ఓజీలో ఆకిరానందన్ నటిస్తున్నాడంటూ గత కొన్ని రోజులుగా వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఈ సన్నివేశంలో కనిపిస్తుంది ఆకిరా అంటూ వీడియో క్లిప్ ని కూడా తాజాగా తెగ వైరల్ చేశారు అభిమానులు. అయితే అది వేరే సినిమాలోని క్లిప్ అని ఆకిర నటించ‌లేద‌ని టీం ఇన్ డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిన.. ఈ పుకారు మాత్రం వైరల్ అవుతూనే ఉంది. తాజాగా ప్రముఖ సంగీత డైరెక్టర్ థ‌మ‌న్ చేసిన కామెంట్స్ వింటుంటే ఓజి సినిమాలో ఆకీరా కూడా బాగమయ్యాడని హింట్‌ ఇచ్చినట్లుగా అనిపిస్తుంది.

OG (2025) - IMDb

కొంతమంది ఆకిర సినిమాలో భాగం కాలేదని.. ఫ్యూచర్లో భాగమవుతాడు అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం థ‌మ‌న్ చేసిన కామెంట్స్. అవసరమైతే ఓజీ కోసం.. ఆకిరాను టీంలో తీసుకుంటా అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఒజీ కోసం అకీరాను భాగం చేసే ప్లాన్ లో థ‌మన్‌ బలంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే థ‌మన్ లాంటీ సంగీత దర్శకుడు ఆకిర‌ను భాగం చేస్తా అనడంలో అర్థం ఏమై ఉంటుంది.. ఆకీర కు పియానో ప్లే చేయడం చాలా బాగా వచ్చు. ఈ క్రమంలోనే సినిమా మ్యూజిక్ కోసం అకిరాను వాడుకోబోతున్నారా.. అందుకే తమన్ అలాంటి కామెంట్స్ చేశారా.. అని సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి.

రూ.30 నుంచి మొదలైన థమన్ కెరీర్.. ఇప్పుడు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? | Music director Ss Thaman remuneration per movie - Telugu Filmibeat

ఈ లెక్కన ఓజీలో అకీరా కన్ఫర్మ్ అయినట్లే. అకిర చేతి వేళ్ళు పెద్దగా ఉంటాయని.. పియానో అద్భుతంగా ప్లే చేస్తాడని థ‌మ‌న్ వెల్లడించాడు. అక్కడి వరకు సరే కానీ.. రెండు నెలలు ఆకిరతో కలిసి పనిచేసిన అనుభవంతో ఓజి కోసం పిలిపిస్తున్న అంటూ థ‌మన్ వెల్లడించాడు. అయితే ఆకిర రెండు నెలలు థ‌మన్‌తో ఎప్పుడు పనిచేశాడు అనేది ఇప్పుడు అభిమానుల్లో పెద్ద ప్రశ్నగా మారింది. రీసెంట్గా థ‌మన్ పనిచేసిన ఓ సినిమాకు ఆకిర వర్క్ చేశాడా.. లేదా ఓజీ కోసం ఆకీరా ఇప్పటికే పని చేసి ఉన్నడా.. అనేది తెలియాల్సి ఉంది. ఇక మరో రెండు మూడేళ్ళ‌లో నటవరసుడిగా అకీరాను ఇండస్ట్రీలోకి తీసుకురావాలని పవన్ ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. రాజకీయాల్లో బిజీగా ఉన్న క్రమంలో కొడుకుని నటుడుగా తీసుకువచ్చే అవకాశాలు కూడా ఉన్నాయట‌. ఇప్పటికే వైజాగ్ సత్యానంద్‌ దగ్గర ప్రాక్టీస్ మొదలు పెట్టాడని టాక్.