‘ పొట్టేల్ ‘ రివ్యూ.. అనన్య నాగళ్ళ అరాచ‌కం ఆడేసిందా..?

టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ళ హీరోయిన్గా, యువచంద్ర హీరోగా తెరకెక్కిన తాజా మూవీ పొట్టేలు. టైటిల్ తోనే ఆడియన్స్ లో హైప్‌ క్రియేట్ చేసిన ఈ సినిమాలో అజయ్ నెగెటీవ్‌ పాత్రలో కనిపించాడు. శ్రీకాంత్ అయ్యంగర్‌, నోయల్, రింగ్ రియాజ్ లాంటి స్టార్ సెలబ్రిటీస్ కీలక పాత్రలో కనిపించిన ఈ సినిమా.. ప్రమోషనల్ కంటెంట్ తోనే ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్లో అజయ్ లేడీ గెటప్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొల్పింది. కంటెంట్ పై నమ్మకంతో సినిమాను ఒక రోజు ముందే ప్రీమియర్ షో రిలీజ్ చేశారు మేకర్స్. సినిమా ఎలా ఉంది.. అనన్య నాగళ్ళ అరాచకం ఆడేసిందా.. లేదా.. రివ్యూ లో చూద్దాం.

Pottel Movie Review: పొట్టేల్ రివ్యూ..అనన్య నాగళ్ళ హిట్ కొట్టినట్టేనా? -  NTV Telugu

క‌థ‌:

తెలంగాణ ప్రాంతం పటేల్ వ్యవస్థ రాజ్యమేలుతున్న కాలం. పెద్ద గంగధారి (యువ చంద్ర) చదువుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా అవి సక్సెస్ కాకపోవడంతో.. తన కులవృత్తి అయిన గొర్రెలను మేపుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే తన గ్రామ ఆచారం ప్రకారం.. బాలమ్మ అమ్మవారి అనుగ్రహంగా భావించే ‘ పొట్టేల్ ‘ మేకని పెంచుతాడు. తన భార్య బుజ్జమ్మ(అన‌న్య‌) ఒకసారి పెద్ద గంగాధారితో నువ్వెలాగూ చదువుకోలేకపోయావు.. మన కూతురు నైనా చదివించు అని చెప్పడంతో కూతురు సరస్వతి( త‌న‌స్వీ చౌద‌రి)ని ఎలాగైనా చదివించి ప్రయోజకురాలిని చేయాలనుకుంటాడు. మరో పక్క ఊరి పెద్ద.. బాలమ్మ పూనే భూస్వామి పటేల్.. పెద్ద గంగధారితో సహా.. ఊళ్లో వాళ్ళందరి పైన పెత్త‌నం చేస్తూ.. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాడు.

తక్కువ కులం వాళ్ళ‌ని దగ్గరకు కూడా రానీయకుండా అరాచకంగా చేస్తూ ఉంటాడు. అయితే అమ్మవారు పూనుతుందనే ఒక్కవు కారణంతోనే పటేల్ ని దేవుడిలా జనం భావిస్తారు. ఆ గ్రామ దేవత‌.. బాలమ్మ తల్లి పటేల్‌కు ఆవహించి పటేల్ ద్వారా మంచి, చెడులను వెల్లడిస్తూ ఉంటుంది. అయితే గంగ‌ధారి కూతుర్ని చదివించాలని చేస్తున్న ప్రయత్నాన్ని విఫలం చేయడం కోసం.. పటేల్ పన్నాగం పన్నుతాడు. బాలమ్మ తల్లి ‘ పొట్టేల్ ‘ ని దొంగతనం చేసి.. పెద్ద గంగ దారిపై ఆ నేరాన్ని మోపి దోషగా నిలబెడతాడు. ఇక ‘ పొట్టేల్ ‘ ను పెద్ద గంగధారి పట్టుకున్నాడా.. లేదా.. ఈ ప్రాసెస్ లో ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు.. ఇంతకీ సరస్వతి చదువుకుందా.. అసలా పటేల్‌కు నిజంగానే బాలమ్మ ఆవహిస్తుందా.. చివరకు ఏం జరిగింది.. అనేది తెలియాలంటే బిగ్ స్క్రీన్ పై చూడాల్సిందే.

అనన్య నాగళ్ల పొట్టేల్.. ట్రైలర్‌ వచ్చేసింది! | Ananya Nagalla Latest Movie  Pottel Movie Trailer Out Now | Sakshi

క‌ధాంశం:
కన్న కూతురిని ఉన్నత చదువులు చదివించాలని తండ్రి పడే కష్టం తన కూతురిని ఎలా చదివించాడు అనే పాయింట్ పై సినిమాను వీలైనంత రా అండ్ రెస్ట్రిక్‌గా ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చారు. ఎక్కువగా కోలీవుడ్ లో తెర‌కెక్కే కథ‌ల‌ను.. పూర్తిగా తెలంగాణ నేపథ్యంలో రూపొందించి ప్రేక్షకులను ఆకట్టుకునేలా సాహిత్ కథను రాసుకున్నాడు. కథ‌ అద్భుతంగా అనిపించినా.. ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నంలో కాస్త తడబడినట్లు అనిపించింది. దేవతలు, దేవుళ్ళు ఉంటారు కానీ.. మనం అనుకున్నట్టు వాళ్ళు బలులు కోరారు. మూఢనమ్మకాలతో అరాచకాలు పెరిగితే దండించడానికి వాళ్ళు వస్తారు అని సింబాలిక్‌గ్గా కథ‌ని తెరకెక్కించాడు.

ఇక అప్పట్లో చదువుపై జనం ఎలా శ్రద్ధ చూపేవారు.. వారి దాకా చదువులు వెళ్లకుండా దృష్ట శ‌క్తులు ఎలా ఆపేవి.. ఇలాంటి విషయాలను కన్వీన్సింగ్‌గా చూపించాడు సాహిత్. ఆ కాలంలో పుట్టకుండా మనం చాలా అదృష్టం చేసుకున్నాం. అప్పట్లో పుట్టి ఉంటే ఎన్ని అరాచకాలు చూడాల్సి వచ్చేదో అనే ఫీల్‌ సినిమా చూసే ఆడియన్స్ కు కలిగుతుంది. అయితే ఇలాంటి స్టోరీలు హీరో మొదట బలహీనుడిగా ఉన్న సందర్భని బ‌ట్టి బలవంతుడిగా మారతాడు. తన శక్తిని తెలుసుకొని ప్రవర్తిస్తాడు. కానీ.. ఈ సినిమాలో మొదటి నుంచి చివరి వరకు కూడా హీరోని బలహీనుడు గానే చూపించడం ఆడియన్స్‌ను నిరాశ ప‌రిచంది.

Ananya Nagalla interview: Pottel is a make-or-break film in my career

దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ మంచిదే కానీ.. చూపించిన విధానంలో తడబడ్డాడు. చదువుకొని వారికే చదువు విలువ తెలుస్తుంది.. మైళ్ళ దూరం ప్రయాణించి ఎంతో శ్రమించిన వాళ్లకే చదువు విలువ తెలుస్తుంది.. కానీ.. ఈ జనరేషన్ అలా లేదు ఈజీగా అన్ని దొరికేస్తుంటే చదువు కోసం ఇంత డ్రామా అవసరమా అసలు ఏంట్రా బాబు.. ఈ ఓవరాక్షన్ అని అక్కడక్కడ కొంతమంది ఫీల్ అయ్యేలా అనిపించింది. అసలు దర్శకుడు కూడా 80% నేపథ్యం చదువు ఇంపార్టెన్స్ చెప్పడానికే తాపత్రయపడ్డాడు. సినిమా ఓ సాధారణ ప్రేక్షకులు చూస్తే కాస్త గోలగా అనిపించినా.. డీటెలింగ్ విషయంలో మాత్రం నిజంగా డైరెక్టర్కు ఫిదా అవ్వాల్సిందే. కథ‌ ముఖ్యంగా తెలంగాణ వాళ్లకు మాత్రమే కనెక్ట్ అయ్యేలా ఉంది. ఆంధ్ర వాళ్లకు అది నసల అనిపించవచ్చు. ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అయ్యే అవకాశం లేదు. చాలా చోట్ల లాజిక్ లెస్ గా సినిమాను తెరకెక్కించార‌నిపించింది. క్లైమాక్స్ మాత్రం గూస్ బంప్స్ తెప్పిస్తుంది.

నటీన‌టుల‌ ప‌ర్‌ఫార్మెన్స్‌:

ఇక నటీన‌టుల‌ విషయానికి వస్తే మొదటి అజయ్ పాత్ర గురించే మాట్లాడుకోవాలి. పటేల్‌గా అజయ్ జీవించేసాడు. కనిపించినంత సేపు అతన్ని కచ్చితంగా ఏదో ఒకటి చేసేయాలన్నంత కోపం వచ్చేలా నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు అజయ్ యాక్టింగ్ నెవ‌ర్‌బిఫోర్ అనడంలో సందేహం లేదు. ఇక సినిమాలో యువచంద్ర నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం అనన్య అజయ్‌కి ఉన్న ఫాలోయింగ్ రిత్యా సినిమాకు వెళ్ళిన వారికి అజయ్ యాక్టింగ్ ఒక సర్ప్రైజ్ అనొచ్చు. అనన్య నటన కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. వీరి కుమార్తె పాత్రలో నటించిన తనస్వీకి ఫ్యూచర్ బాగుంటుంది అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతలా ఆమె తన పాత్రలో సహ‌జ నటనతో మెప్పించింది. శ్రీకాంత్ అయ్యంగర్‌కి చాలాకాలం తర్వాత ఒక మంచి కంటెంట్ దొరికింది. నోయల్ కూడా తన పాత్ర పరిధిలో ఆకట్టుకున్నాడు. రింగ్ రియాజ్ ఇప్పటివరకు కమెడియన్ గా మాత్రమే తెలుసు కానీ.. ఎమోషనల్ పాత్రలోనూ తను ఆకట్టుకుని తన సత్తా చాటుకున్నాడు.

దసరాకి పొట్టేల్‌ | Ananya Nagalla Pottel Movie Getting Ready For Dussehra  Release | Sakshi

టెక్నికల్ వ‌ర్క్‌
టెక్నికల్ గా చూసుకుంటే టీ మొత్తానికి సాగర్ చంద్రనే హీరో. ఆయన అందించిన మ్యూజిక్, బీజీఎం సినిమాను వేరే లెవెల్ కు తీసుకెళ్లాయి. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ లో ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆడియన్స్ లో గూస్ బంప్స్‌ వచ్చేలా చేసింది. 1980 కాలాన్ని ఆరాచకాలను మరోసారి ప్రేక్షకుల ముందుకు ఆర్ డిపార్ట్మెంట్ కళ్లకు కట్టినట్లుగా తీసుకువచ్చారు. మరి కష్టం ప్రతిఫేంలోను కనబడుతుంది. ఇక సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు కూడా ఎక్కడ తగ్గకుండా నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా తెర‌కెక్కినట్లు అనిపించింది.

చివ‌రి లైన్
మొత్తంగా మూఢనమ్మకాల అణిచివెతకు గురైన.. చదువు కారణంగా బయటపడ్డ ఓ ఊరి కథ పొట్టేల్. ఒక సీరియస్ కదా అంశం కనుక అందరికీ కనెక్ట్ కావడం కష్టమే