శ్రీదేవి తో ఉన్న ఈ స్టార్ హీరోయిన్ ను గుర్తుపట్టారా.. అమ్మడి క్రేజే వేరే లెవెల్..

సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రేల చిన్ననాటి ఫొటోస్‌ త్రో బ్యాక్ థీంతో ఎప్పటినుంచో నెటింట వైరల్ గా మారుతున్న సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే టాలీవుడ్‌కు సంబంధించిన ఎంతో మంది స్టార్ హీరోయిన్ ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అలా ఇప్పుడు మనం పై ఫోటోలో చూస్తున్న ఈ అమ్మడు పిక్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఇంత‌కీ శ్రీదేవితో కలిసి కనిపిస్తున్న ఈ అమ్మడి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె సౌత్ క్రేజీ హీరోయిన్. అమ్మడికి టాలీవుడ్‌లోను మంచి పాపులారిటీ ఉంది. మొద‌ట బాలీవుడ్ లో హీరోయిన్‌గా అడుగుపెట్టి అక్కడ తన స‌త్తా చాటుకున్న ఈ ముద్దుగుమ్మ త‌ర్వాత‌ తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ సినిమాల్లో నటించే ఆకట్టుకుంది.

நடிகை ஸ்ரீதேவியுடன் சிறு வயதில் புகைப்படம் எடுத்துக்கொண்ட நடிகை ஜோதிகா

ఎంతమంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఈమె ఓ స్టార్ హీరో భార్య కూడా.. ఇప్పుటికైనా గెస్ చేశారా.. స‌ర్లెండి మేమే చెపేస్తాం. త‌ను ఎవరో కాదు శ్రీదేవి కజిన్ సిస్టర్ జ్యోతిక. ప్రస్తుతం జ్యోతికకు సంబంధించిన చిన్ననాటి ఫొటోస్ వైరల్ గా మారుతున్నాయి. ఒకప్పటి సీనియర్ హీరోయిన్ శ్రీదేవి, నగ్మాల చెల్లెలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జ్యోతిక.. 90 లలో కోలీవుడ్ స్టార్ హీరోయిన్గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. ప్రియదర్శన్ డైరెక్షన్లో 1998లో వచ్చిన డోలి సజాకి రాగ్న సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన జ్యోతిక‌.. తర్వాత కోలీవుడ్ లో స్టార్ హీరో అజిత్ నటించిన వాలి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

Jyothika talks about what makes a marriage 'ideal' - Hindustan Times

అలా హిందీ తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ సినిమాల్లో నటించే ఆకట్టుకుంది. తెలుగులో మెగాస్టార్ ఠాగూర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన జ్యోతిక.. చంద్రముఖి సినిమాలోను నటించి విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్యను ప్రేమించి 2006 సెప్టెంబర్ 11న వివాహం చేసుకుంది. ఇక పెళ్ళి తర్వాత ఇండస్ట్రీకి కొంతకాలం దూరమైన ఈ అమ్మ‌డ మళ్ళీ చాలా కిలం గ్యాప్ త‌ర్వాత రీ ఎంట్రి ఇచ్చి హీరోయిన్ గా తన సత్తా చాటుకుంటుంది.