ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీగా ఎదిగిన వారి లైఫ్ అంతా పూల పాన్పు అని.. లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తూ హ్యాపీగా ఉంటారని అంతా భావిస్తారు. కానీ.. అందరి జీవితం పూల పన్పు కాదు. ఎన్నో కష్టాలు, సమస్యలు ఎదుర్కొన్న తర్వాత.. వాళ్లు స్టార్ సెలబ్రెటీ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటారు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తారు. అలా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి.. చిన్న చిన్న పాత్రలో నటిస్తూనే స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న హీరోయిన్ కూడా ఒకటి.
ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టకముందు ఎన్నో కష్టాలను అనుభవించిన ఈ అమ్మడు.. వాటన్నింటినీ అధిగమించి వచ్చిన అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకుంటూ స్టార్ట్ బ్యూటీగా మారింది. ఇంతకీ ఈ హాట్ బ్యూటీని గుర్తుపట్టారా.. అమ్మే కష్టాలు చెబితే ఎవరికైనా కంటతడి వస్తుంది. 18 ఏళ్లకే పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు 20 ఏళ్ళకు బిడ్డకు జన్మనిచింది. తర్వాత ఊహించని సంఘటనలతో అతనికి విడాకులు ఇచ్చేసింది. ఇండస్ట్రీలో.. అడుగుపెట్టిన నటినటులు ఎంతో మంది చిన్న వయసులోనే వివాహం చేసుకోవడం.. వారికి విడాకులు లాంటివి జరుగుతూనే ఉంటాయి.
కానీ.. ఈ హీరోయిన్ కు ఏకంగా రెండుసార్లు పెళై.. రెండుసార్లు విడాకులు అయ్యాయి. 18 ఏళ్ళకి పెళ్ళై 20 ఏళ్లకు తలైనాయి ఈ అమ్మడు అతనితో విడాకులు తర్వాత చాలా కాలానికి మరో వ్యక్తితో దాదాపు మూడు ఏళ్లు డేటింగ్ చేసి వివాహం చేసుకుంది. అతనితోను ఓ బిడ్డ పుట్టిన తర్వాత.. మనస్పర్ధలు కారణంగా డివోర్స్ తీసుకుంది. ఇంతకీ ఆమె ఎవరో చెప్పలేదు కదా.. తనే బాలీవుడ్ బ్యూటీ శ్వేతా తివారి. మొదట 2000లో అన్ వాలాపల్ సీరియల్ ద్వారా నటిగా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. సీరియల్స్‌లో భారీ పాపులారిటి దక్కించుకొని.. తర్వాత సినిమాల్లో అవకాశాలు సొంతం చేసుకుంది.
మొదట 1998లో నటుడు రాజా చౌదరిని.. శ్వేత తివారి వివాహం చేసుకుంది. 9ఏళ్ళ తర్వాత 2007లో అతని విడాకులు ఇచ్చేసింది. ఇక 2010 నుంచి నటుడు అభినవ్ కోహ్లితో మూడు సంవత్సరాల డేటింగ్ చేసి 13 జులై 2013 న వివాహం చేసుకుంది. 2016 నవంబర్ 27న ఓ మగ బిడ్డకు జన్మనిచ్చిన తివారి.. కోహ్లీతోను 2019లో విడిపోయింది. జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న సినీ కెరీర్‌లో మాత్రం తన సత్తా చాటుతూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది.