ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన తాజా మూవీ దేవర. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ముఖ్యపాత్రలో బాలీవుడ్ స్టార్.. నేషనల్ ఆవార్డ్ విన్నర్ సైఫ్ అలీ ఖాన్ నటించి మెప్పించాడు. సైఫ్ పాత్ర సినిమాను వేరే లెవల్ కు తీసుకెళ్ళింది అనడంలో సందేహం లేదు. అంతే కాదు దేవర సినిమాలో ఎన్టీఆర్ కి సరైన పోటీగా బైరా పాత్ర ఇంపాక్ట్.. అలాగే ఆయన నటన కారణంగానే సినిమా సక్సెస్ అయిందంటూ ఎంతో మంది అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
దేవర సినిమా షూటింగ్ టైం లో సౌఫ్ పాత్ర గురించి చాలా చర్చ జరిగిందట. బాలీవుడ్ నుంచి సైఫ్‌ను తీసుకొని రావలసిన అవసరం ఉందా. ఈ పాత్రకు అంత సీన్ ఉందా.. అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారని.. సినిమాకు పాన్ ఇండియా హైప్ తీసుకురావాలంటే సైఫ్ నటించాలని కొందరు భావించారట. కానీ.. సినిమాలోని రోల్ డిమాండ్ చేయడంతోనే సైఫ్‌ను తీసుకురావాల్సి వచ్చిందని.. దీనికి భారీ రెమ్యునరేషన్ చెల్లించినట్లు టాక్. సోషల్ మీడియాలో సైఫ్ రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతుంది. ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోగా ఉన్న సైఫ్.. ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తున్నాడు. అయినా రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నాడు.
దాదాపు రూ.10 కోట్ల రమ్యనరేషన్ చార్జ్ చేస్తున్నాడు. ఇక దేవర సినిమాకు మాత్రమే ఏకంగా రూ.12.5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. ఆయన సినిమాల్లో చేసిన పాత్ర ఇంపార్టెన్స్ తో పాటే.. డేట్లు కూడా ఎక్కువ కేటాయించడం వల్ల.. అంత భారీ రెమ్యనరేషన్ తీసుకున్నాడని సమాచారం. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన జాన్వికి.. రూ.5 కోట్లు, ఎన్టీఆర్‌కు రూ.60 కోట్లు ఇచ్చినట్లు టాక్. ఇక ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.550 కోట్ల కలెక్షన్లు కల్లగొట్టగా.. ఫ్యూచర్లో రూ.600 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. కొరటాల డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికీ మంచి స్పందన వస్తుంది. సినిమాకు భారీ ఎత్తున ఓపెనింగ్స్ రావడం. అలాగే సినిమాపై మెల్లమెల్లగా హైప్ పెరగడంతో ఇప్పటికి ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి నెలకొంటూనే ఉంది.