నందమూరి కుటుంబంలో బాలయ్య, తారక్ మధ్య వివాదాల గురించి ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. నందమూరి కుటుంబం అంతా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కుటుంబాలను దూరం పెట్టిందని.. ఇప్పటికే ఎన్నో వార్తలు వినిపించాయి. దానికి తగ్గట్టుగానే బాలకృష్ణ కూడా ఎన్నో సందర్భాల్లో వారిని దూరంగా ఉంచారు. అలాగే తారకరత్న చనిపోయిన క్రమంలో కూడా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అక్కడికి వెళినా.. వారిని పట్టించుకోకుండా వదిలేశాడు బాలయ్య. అయితే జూనియర్ ఎన్టీఆర్ కి సపోర్ట్ గా ఉండడం వల్లే కళ్యాణ్ రామ్‌ని కూడా బాలయ్య పట్టించుకోవడంలేదని వార్తలు కూడా గతంలో వైరల్ అయ్యాయి.
అయితే తన బాబాయ్.. బాలయ్యతో ఉన్న గొడవలు గురించి గతంలో ఎన్టీఆర్ రియాక్ట్ అవుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో మూవీ ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసింది. ఇక ఈ సినిమా ప్రమోషన్ టైంలో ఇందులో ఎన్టీఆర్‌కు విలన్ గా నటించిన జగపతిబాబు.. అసలు మీ బాబాయ్ బాలకృష్ణ తో మీ ఇంటి గొడవలు ఏంటి అంటూ ప్రశ్నించాడు. అయితే ఈ ప్రశ్నకు తారక్ సమాధానం ఇవ్వకుండా దాటేస్తారని అంతా భావించారు.
కానీ.. తారక్ మాత్రం చాలా ఓపెన్గా రియాక్ట్ అయ్యాడు. నాకు ఆయనతో గొడవలు ఎందుకు ఉంటాయి.. ఆయన మా నాన్న తమ్ముడు.. నాకు తండ్రి లాంటివాళ్ళు.. ఆయనతో నాకు ఎప్పుడు ఎలాంటి గొడవలు లేవు. ఒకవేళ గొడవలు ఉన్న నేను వాటిని మనసులో పెట్టుకొను అంటూ చెప్పుకొచ్చాడు. ఏదైనా ఓపెన్ గా మాట్లాడుతానని.. మనసులో పెట్టుకొని చెప్పిన తారక్.. బాబాయ్ బాలకృష్ణతో గొడవలపై చేసిన కామెంట్స్ అప్పుడు మీడియాలో తెగ వైరల్ గా మారాయి. అసలు వీరిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేనప్పుడు.. ఎందుకు దూరంగా పెట్టారని సందేహాలు ఇప్పటికే ఎంతోమంది నందమూరి అభిమానుల్లో నెలకొంటూనే ఉన్నాయి.