టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు సినిమాలను ఒప్పుకున్న పవన్ కళ్యాణ్.. ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక.. ఖచ్చితంగా సాయం చేసిన సినిమాలను మాత్రం నటించేస్తానని మాట ఇచ్చారు. అలా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో ఓజి కూడా ఒకటి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శించనున్నాడని సంగతి తెలిసిందే. అయితే చాలామందికి పవన్ కళ్యాణ్ మొదటి నుంచే కరాటేలో బ్లాక్ బెల్ట్, మార్షల్ ఆర్ట్స్ కూడా అభ్యసించాడని తెలిసి ఉండదు. ఇక ఇటీవల తమిళ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ దీని గురించి వివరించారు. తను మార్షల్ ఆర్ట్స్ గురించి మాట్లాడుతూ.. నేను ప్రాణం పెట్టి కరాటే నేర్చుకున్నాను అని.. మైలాపూర్ లో మార్షల్ ఆర్ట్ అభ్యసించినట్లు వెల్లడించాడు.
అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర శ్రీహాన్ హుస్సేన్ మాస్టర్ దగ్గర నేను కరాటే నేర్చుకున్నానని. చెన్నై దగ్గర్లో మైలాపూర్ అనే ఏరియాలో ఇది ఉందంటూ వెల్లడించాడు. ఇండియాలోనే ప్రముఖ మార్షల్ ఆర్ట్స్.. కరాటే మాస్టర్ శ్రీహాన్ హుస్సేన్ దగ్గర పవన్ కళ్యాణ్ కరాటే అభ్యసించారట. శ్రీహన హుస్సేన్ కేవలం కరాటే మాస్టర్ మాత్రమే కాదు. ఆర్చరీ కోచ్, పెయింటర్ అలాగే నటుడుగాను మంచి ఇమేజ్ను సంపాదించుకున్నారు. గతంలో శ్రీహన్ హుస్సేన్ కూడా ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. రోజు తన దగ్గర కరాటే నేర్చుకోవాలని వచ్చేవాడని.. నేను మొదట్లో నో చెప్పేసా. నాకు కాళీ లేదు.. నేర్పించనన్న.. అయితే ఓ రోజు పొద్దున్నే వచ్చి నేర్చుకుంటే మీ దగ్గరే నేర్చుకుంట అని పట్టుదలతో మాట్లాడాడని వివరించాడు.
దాంతో నేను రోజు పొద్దున్నే 5:00 నుంచి రాత్రి 11:00 వరకు వెయిట్ చేయాలి.. మధ్యలో టైం దొరికితే ఓ అరగంట నేర్పిస్తా అని చెప్పానని.. తర్వాత రోజు నుంచి పవన్ కళ్యాణ్ చెప్పిన సమయానికి వచ్చి ఉండేవాడని.. నాకు టీ పెట్టిచ్చేవాడు.. అలాగే బిల్డింగ్ క్లీన్ చేసేవాడు.. అంటూ చెప్పుకొచ్చాడు. అతని నిజాయితీ నచ్చి నేను మూడు నెలల పాటు కరాటే నేర్పించానంటూ వెల్లడించాడు. ఇక తర్వాత పవన్ కళ్యాణ్.. మెగాస్టార్ తమ్ముడు అని నాకు తెలిసింది నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది.. అంత పెద్ద స్టార్ హీరో తమ్ముడు ఇలా నా దగ్గర నేర్చుకోవడానికి అంత పట్టుపట్టాడా అని అనిపించింది అంటూ వెల్లడించాడు. ప్రస్తుతం ఈ న్యూస్ నెటింట వైరల్ అవడంతో పవన్ కళ్యాణ్ డెడికేషన్ ఇలానే ఉంటుంది అంటూ.. అది పవర్ స్టార్ పట్టుదల.. ఏదైనా అనుకుంటే సాధించి తీరుతాడు అంటూ.. అభిమానులు తమ హీరోపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక త్వరలో రానున్న ఓజీలో పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ఎలా చేయనున్నాడు.