టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా రాణిస్తున్నాడు. చివరిగా ఈయన నటించిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో ప్రభాస్ అప్కమింగ్ సినిమాలపై ఆడియన్స్ లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే డార్లింగ్ సినీ కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీలో పౌర్ణమి కూడా ఒకటి. అప్పట్లో మ్యూజికల్ బ్లాక్ బాస్టర్ గా రికార్డ్ సృష్టించిన ఈ సినిమా.. సుమంత్ యాడ్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఎమ్.ఎస్. రాజు రూపొందించారు. ప్రభాస్ సరసన త్రిష హీరోయిన్గా నటించి మెప్పించింది. మరో హీరోయిన్గా చార్మి ఆకట్టుకుంది. అయితే ఇందులో ప్రభాస్, చార్మి మధ్య వచ్చే ఫన్నీ సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఎంటర్టైన్ చేస్తాయి. అంతేకాదు సినిమాలో హీరోయిన్ సింధు తులాని ఓ కీలక పాత్రలో కనిపించింది.
అప్పట్లో ఈ సినిమాలో సాంగ్స్ మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇప్పటికి ఈ సినిమాలో సాంగ్స్ చాలా చోట్ల వినిపిస్తూనే ఉంటాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మరో హీరోయిన్ నిలిచింది. తనే మధు శర్మ. ఈ పేరు చెప్తే టక్కున గుర్తుకురాదు. కానీ ప్రభాస్ వెంట పడుతూ తనను ఇష్టపడిన వివాహిత మోహిని పాత్రలో నటించిన అమ్మాయి అంటే టక్కున గుర్తుకు వస్తుంది. ముంబైకి చెందిన మధు శర్మ.. పౌర్ణమి కంటే ముందు హిందీ, మరాఠీలో ఎన్నో సినిమాలో నటించి ఆకట్టుకుంది. అప్పట్లో ఎక్కువగా సెకండ్ హీరోయిన్గా పలు సినిమాలో నటించిన.. తమిళంలో గురువారవ్యే సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి సక్సెస్ అందుకుంది. ఈ నార్త్ ఇండియన్ బ్యూటీ తర్వాత తెలుగు తెరకు పరిచయమై విలక్షణ నటుడు జగపతిబాబు హీరోగా వచ్చిన పాండు సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.
ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించిన మధు శర్మ.. శివాజీ, లయ.. అదిరిందయ్యా చంద్రం, శ్లోకం, గౌతమ్ ఎస్ఎస్సి ఇలా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. అలాగే అల్లరి నరేష్, శశాంక్ సరసన పార్టీ సినిమాలోను కనిపించింది. ఇక చాలా కాలం గ్యాప్ తర్వాత పౌర్ణమిలో మోహిని పాత్రలో మెప్పించింది ఇందులో 60 ఏళ్ల ఏవీఎస్ కు భార్యగా కనిపించిన మధు శర్మ.. ఈ సినిమా తర్వాత వరుసగా ఆఫర్లు అందుకున్న పెద్దగా గుర్తింపు రాకపోవడంతో తెలుగు సినిమాలకు దూరమైంది. తెలుగు, హిందీ, తమిళ్ లో సినిమాలు చేసిన మధుశర్మ.. భోజపురిలోను నటించి మెప్పించింది. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో అల్లరించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు పలు సీరియల్స్ లో నటిస్తూ సోషల్ మీడియాలోనూ సందడి చేస్తుంది. ఈ క్రమంలో అమ్మడి లేటెస్ట్ పిక్స్ వైరల్ కావడంతో ఏంటి పౌర్ణమి సినిమాలో ఉన్న మోహిని ఈమె నా అంటూ అంత ఆశ్చర్యపోతున్నారు. అప్పటికంటే ఇప్పుడు మరింత అందంగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.