సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా రాణిస్తున్నారు అంటే వారికి కచ్చితంగా ఎంతో కొంత ఫాలోయింగ్ ఉండనే ఉంటుంది. ఈ క్రమంలోనే వారికి సంబంధించిన ప్రతి చిన్న విషయం నెటింట తెగ వైరల్ గా మారుతుంది. వారి లగ్జరీ లైఫ్ నుంచి.. వారు పెట్టుకునే కళ్ళజోడు, హ్యాండ్ బ్యాగ్ వరకు ప్రతి ఒక్కటి హైలెట్ అవుతూ ఉంటుంది. గతంలో ఏ న్యూస్ బయటకు రావాలన్నా మెయిన్ మీడియా ద్వారానే బయటకు వచ్చేది. ఈ క్రమంలో కొన్ని కొన్ని వార్తలు బయటకు రాకుండానే కనుమరుగయ్యేవి.
కానీ ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అంటూ సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న న్యూస్ అయినా క్షణాల్లో బయటకు వస్తుంది. అలా తాజగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు టాలీవుడ్‌లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా రాజకీయాల్లోనూ తన సత్త చాటుతున్న పవన్ కళ్యాణ్ కు సంబంధించి ఏ న్యూస్ నెట్టింట వినిపించినా.. క్షణాల్లో దానిని అభిమానులు తెగ ట్రెండ్ చేస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా ఖచ్చితంగా ఆయన వెంట ఓ వస్తువు ఉండాల్సిందే అంటూ న్యూస్ వినిపిస్తుంది. ఇంతకీ అదేంటో అనుకుంటున్నారా.. అదే డైరీ, బుక్. పవన్ కళ్యాణ్ కు మొదటి నుంచి బుక్స్ చదవడం అంటే చాలా ఇంట్రెస్ట్. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఎక్కడికైనా బయటకు వెళ్లాలంటే.. కచ్చితంగా తన వెంట ఏదో ఒక నవల్ కానీ.. బుక్ కానీ పెట్టుకొని వెళ్తారట. పవన్ వెంట ఏది ఉన్నా లేకున్నా బుక్స్ మాత్రం ఆయన కారులో ఎప్పుడూ ఉంటాయట. ఎక్కువ దూరం జర్నీ చేస్తున్న టైంలో పవన ఆ బుక్స్ చదువుతూ టైం స్పెండ్ చేస్తారట.