టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుని స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేసుకుంటూ గ్లోబల్ స్టార్‌గా దూసుకుపోతున్న ఎన్టీఆర్.. వరుస సినిమాల లైనప్‌తో బిజీగా ఉన్నాడు. ఇక ప్రస్తుతం బాలీవుడ్ వార్2 సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్న తారక్ ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్‌తో మరో సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. దీంతో పాటే తారక్.. ప్రభాస్ డైరెక్టర్‌ను లైన్లో పెట్టాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు హనురాగపూడి. ఎన్టీఆర్, హనురాగపూడి డైరెక్షన్లో కూడా ఓ సినిమా చేయబోతున్నాడట. ఇప్పటికే హనురాగపూడి.. ప్రభాస్ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా తర్వాత.. ఎన్టీఆర్‌తో హనురాగపూడి సినిమా ఉండబోతుందని టాక్. ఏది ఏమైనా హనురాగపూడి ప్రస్తుతం ప్రభాస్‌తో తెరకెక్కించే సినిమాతో సూపర్ సక్సెస్ అందుకోవాలని కసితో పని చేస్తున్నాడట. దీంతో పాట్టే మొదటి నుంచి ఎన్టీఆర్ అభిమాని కావడంతో.. ఎన్టీఆర్ తో కూడా ఓ భారీ సినిమా తీయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది.
జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలను చేస్తూ మంచి స్వింగ్‌లో ఉన్నాడు. ఇప్పుడు వరుసగా ఏడు సక్సెస్‌లను అందుకున్న తారక్.. తను నటించే తర్వాత మూడు సినిమాలతో కూడా సక్సెస్ అందుకుంటే.. వరుసగా పది సినిమాలతో బ్లాక్ బస్టర్లు సాధించిన ఏకైక హీరోగా రికార్డ్ క్రియేట్ చేస్తాడు. ఇక దానికోసమే రాబోయే సినిమాలతో కూడా మంచి సక్సెస్లు అందుకోవాలని సిద్ధమవుతున్నాడట తారక్. ఏది ఏమైనా ప్రస్తుతం ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజ్ రీత్యా సినిమాల సక్సెస్ ఇప్పుడు ఆగేలా లేదు. మరి తన నెక్స్ట్ సినిమాలతో ఆయన ఫ్యూచర్లో ఇంకెన్ని సక్సెస్‌లు అందుకుంటాడో వేచి చూడాలి.