టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావుకు ఉన్న బ్రాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా పరిశ్రమంలో మొదటి తరం హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన ఏఎన్నార్ లెజెండ్ యాక్టర్ గా ఇమేజ్ దక్కించుకున్నారు. ఇక తెలుగు సినిమాలకు డాన్స్లు పరిచయం చేసిన హీరో కూడా ఏఎన్ఆర్ అనడంలో అతిశయోక్తి లేదు ఆయన స్టెప్పులకు ఆడియన్స్ లో విపరీతమైన క్రేజీ ఉండేది. నాటకాలు క్లాసికల్ డాన్సులు మనుగడలో ఉన్న ఆ రోజుల్లో వెస్ట్రన్ డాన్స్ ఆడియన్స్ కు రుచి చూపించాడు. అందుకే ఆయనకు తెలుగులోనే ప్రత్యేక స్థానం ఉంది. అయిఇతే అంత పెద్ద స్టార్ హీరో అయినా ఏఎన్ఆర్ కూడా తన కెరీర్‌లో ఓ హీరోయిన్‌తో నటించడానికి గజగజ వణికిపోయాడట.
ఆమె భుజంపై చేయి వేయడానికి భయపడ్డాడట. మరి ఇంతకీ ఆ హీరోయున్ ఎవరు.. ఆ స్టోరీ ఏంటో ఒకసారి చూద్దాం. ఏఎన్నార్ సినిమాల్లోకి అడుగుపెట్టకు ముందే ఎంతో మంది నటిమణులను చూశారు. భానుమతి కూడా ఏఎన్ఆర్ అంటే ఏజ్‌లోను.. నటనలోనూ.. పెద్దది కావడంతో అప్పట్లో ఆమె అంటే అందరికీ హడల్. ఎన్టీఆర్, ఎస్వీఆర్‌లు కూడా ఆమె వద్ద కాస్త తగ్గి ఉండేవారట. అంతటి డామినేషన్ చూపించిన భానుమతి.. ఏఎన్ఆర్ సినిమాలో నటిస్తే ఆమెతో నటించడానికి ఏఎన్ఆర్ చాలా భయపడిపోయాడట. ఓ సినిమాలో నటించే సమయంలో టెన్షన్ పడినట్లు ఏఎన్ఆర్ స్వయంగా వివరించాడు.
ఓ పాట షూట్ టైంలో భుజంపై చెయ్యి వేసే శీను ఉంటుందని.. సరిగ్గా వేయని ఆమెనే గద్దించిందని చెప్పుకొచ్చాడు. తన చీర కొంగు మెరుపులు మెరిసేలా ఉందని.. అది గుచ్చుకునేలా ఉందని.. ఓవైపు ఆమెతో నటించాలంటే భయం.. మరోవైపు చీర కంఫర్ట్గా అనిపించలేదు చాలా ఇబ్బంది పడ్డానంటూ ఏఎన్ఆర్ వివరించాడు. ఇక అప్పట్లో ఆమెతో నటిస్తున్న సమయంలో భయంతో చేయి వణుకుతుంటే దాన్ని కవర్ చేసేందుకు మేడం ఈ చీర గుచ్చుకుంటుందని చెప్పాడట.
అది అలానే ఉంటుంది చెయ్యి వెయ్యబోయి హీరో నాతో సరసం ఆడుతున్నావని అన్నదట. అప్పుడు ఏఎన్నార్ మాట్లాడుతూ సరసం కాదండీ.. మీ భుజంపై చేయి వేయాలంటే భయం భయంగా ఉందని వెల్లడించాడట. దీంతో అక్కినేని భయం పోగొట్టడానికి భానుమతి మరుసటి రోజు 16 ఎంఎం.. కెమెరా ఒకటి కొనిచ్చి. జడ్జి కోట, మహాబలిపురం, ఏలూరు లాంటి ప్రదేశాలన్నిటికీ పులిహార, దద్దోజనం కల్పించి తీసుకువెళ్లి తిప్పిందట. ఇద్దరం చేతులు పట్టుకుని పరిగెత్తడం, మీద నీళ్లు చల్లమనడం, చెట్లెక్కించడం ఎలా సరదా పనులన్నీ చేసి అక్కినేని ఫ్రీ ఫీల్ వచ్చేలా చేసిందట. యాక్ట్ చేయడానికి కంఫర్ట్నెస్ కల్పించిందట. నాకు తెలిసి ఇంతలా ఎవరు చేయరు అంటూ ఏఎన్ఆర్ స్వయంగా ఈ విషయాలను వెల్లడించాడు. అంతే కాదు ఏఎన్ఆర్ కు డైలాగులు ఎలా చెప్పాలో కూడా ఆమెను నేర్పించేదట.