రజనీకాంత్ తర్వాత అంత పాపులర్ సమంతనే.. త్రివిక్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

స్టార్ హీరోయిన్ సమంత టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ లోని తన నటనతో సత్తా చాటుకున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా వైరల్ అవుతూనే ఉంది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ మంత్రి కొండ సురేఖ చేసిన సంచలన కామెంట్స్ తో సమంత హాట్ టాపిక్ గా మారింది. ఆ విషయం పక్కన పెడితే సమంత చాలాకాలం తర్వాత తాజాగా జిగ్రా మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరై సందడి చేసింది. ఇందులో సమంతతో పాటే టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ త్రివిక్రమ్ కూడా హాజరయ్యారు. ఇందులో త్రివిక్రమ్.. సమంత గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఏ మాయ చేసావే సినిమానుంచే సమంత హీరో అని.. ఆమెకు వేరే శక్తి అవసరం లేదు.. తానే ఒక శక్తి అంటూ చెప్పుకొచ్చారు.

Trivikram heaps praises on Samantha | cinejosh.com

ముంబైలో ఉండకుండా అప్పుడప్పుడు హైదరాబాద్ కూడా రండి.. మీరు సినిమాలు చేయడం లేదని మేము రాయడం మానేశాం. నటిస్తానంటే మేము రాస్తాం.. అత్తారింటికి దారేది లాగా సమంత కోసం హైదరాబాద్ కు దారేది అనాలేమో అంటూ త్రివిక్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సమంత రావాలని ట్రోల్స్ మొదలు పెట్టాలని త్రివిక్రమ అన్నాడు. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లోనూ విపరీతమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న నటులలో రజనీకాంత్ తర్వాత సమంతనే పాపులర్ అంటూ వెల్లడించాడు. ఇక సమంత సినిమా ఈవెంట్‌లో మాట్లాడుతూ మీ కథలో మీరు హీరో అని అమ్మాయిలకు గుర్తు చేసే బాధ్యత ఎప్పుడూ హీరోయిన్ల పైనే ఉంటుందని.. జిగ్రతో ఆలియా అదే విషయాన్ని చూపిస్తోంది.

Alia, Samantha, Rana Daggubati, Vedang at Jigra Telugu Promotions :  r/BollyBlindsNGossip

దానికి ఆమె సహ నిర్మాతగా రిస్క్ తీసుకున్నారు అంటూ వెల్లడించిన సమంత.. త్రివిక్రమ్, రాహుల్ రవీంద్రన్ నా జి గ్రాస్ అంటూ చెప్పుకొచ్చింది. రాహుల్తో 15 ఏళ్ల ఫ్రెండ్షిప్ అని.. త్రివిక్రమ్ తో మూడు సినిమాలు చేశా.. ప్రతి అమ్మాయికి రానా లాంటి సోదరుడు ఉండాలి అంటూ.. ప్రతి ఒక్కరి గురించి వెల్లడించింది. తెలుగు ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో ఆలియా ఆర్ఆర్ఆర్‌ తో కొంతమేర చూసిందని.. జిగ్రతో పూర్తిస్థాయిలో తీసుకుంటుందని వెల్లడించింది. తెలుగు ప్రేక్షకుల కారణంగానే నేను ఈ స్థాయిలో ఉన్నానని.. వారి ప్రేమ వల్లే ఎదిగా.. వాళ్లంతా నా ఫ్యామిలీ అంటూ సమంత చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమాలో ఆలియా హీరోయిన్‌గా.. జిగ్రా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. దసరా కానుకగా ఈ నెల 11న సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సినిమా ఈవెంట్లో రానా ముఖ్యఅతిథిగా హాజరై సందడి చేశారు.