టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవీ తనయుడిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన రామ్ చరణ్.. అంచెలంచెలుగా ఎదుగుతూ గ్లోబల్ స్టార్‌గా మారాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో అతను ఇంటర్నేషనల్ లెవల్ ఇమేజ్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ మూవీ పనులో బిజీగా ఉన్నాడు చెర్రీ. దీంతో పాటే.. బుచ్చిబాబు సన్నా దర్శకత్వంలో మరో సినిమాకు సిద్ధం అవుతున్నాడు. అయితే చరణ్ పాత ఫోటో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఇంతకి ఈ పై త్రో బ్యాక్ ఫోటోలో చరణ్‌తో కటిసి కనిపిస్తున్న అమ్మాయిని గుర్తుపట్టారా.. ఇప్పుడు తను టాలీవుడ్ టాప్ సెలబ్రిటీ. అంతేకాదు బిగ్ బాస్‌కు కూడా వెళ్లివచ్చింది తనెవరో గుర్తుపట్టారా..?
తను టాలీవుడ్ ఫేమస్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్.. ఇప్పటికైనా ఆమె ఎవరో అర్థమయ్యే ఉంటుంది. తనెవరో కాదు.. టాలీవుడ్ లేడీ కొరియోగ్రాఫర్ గా రాణిస్తున్న ఆని మాస్టర్. ఎందరో స్టార్ హీరోల సినిమాల పాటలకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించిన ఈ అమ్మడు.. బిగ్ బాస్ 5 లో కంటెస్టెంట్‌గా పాల్గొని సందడి చేసింది. కెరీర్ ప్రారంభంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఎన్నో సినిమాలకు వ్యవహరించిన అని.. అదే క్రమంలో చరణ్తోను ఓ సినిమాకు పనిచేసింది.
ఇక అప్పట్లోనే రామ్‌చరణ్‌తో ఈ ఫోటో దిగింది. ఇక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ నుంచి స్టార్ కొరియోగ్రాఫర్ గా ఓ రేంజ్ కు ఎదిగిన ఈ అమ్మడు.. పలు బుల్లితెర షోలలో జడ్జ్ గాను వ్యవహరిస్తూ ప్రేక్షకులకు దగ్గర అయింది. ఈ క్రమంలో అమ్మడి టీనేజ్ ఫోటోలు నెటింట తెగ వైరల్ గా మారుతున్నాయి. అయితే అప్పటికి, ఇప్పటికీ ఆమె ఫేసులో చాలా చేంజెస్ వచ్చాయి. ఈ క్రమంలో ఫోటోలు వైరల్ అవ్వడంతో తను అని మాస్టరా.. ఇంత చేంజ్ అయ్యిపియిందా అంటూ.. తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు నెటిజెన్లు.