జానీ మాస్టర్ వివాదంతో ఇండస్ట్రీ రెండుగా చీలిపోయిందా.. ఏం జరుగుతుందంటే..?

టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ కమ్‌ డాన్సర్‌గా మంచి ఇమేజ్ సంపాదించుకున్న జానీ మాస్టర్ పై.. ఇటీవ‌ల‌ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కేసు న‌మోదైన సంగ‌తి తెలిసిందే. ఈ సంఘటన సినీ ఇండస్ట్రీలో తీవ్ర‌ కలకలం రేపుతుంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే జానీ మాస్టర్ పై ఐపీసీ సెక్షన్ 376, 506, 323(2) అలాగే ఫోక్స్ కేసులు కూడా నమోదు చేశారు. ఈ వివాదం పై ఇండస్ట్రీలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ వివాదం పై ఫిలిమ్ ఛింబర్‌లో ఎంతోమంది రెస్పాండ్ అయ్యారు.

Jani Master Case : జానీ మాస్టర్ కేసులో ట్విస్ట్.. బాధితురాలి వెనుక ఆ హీరో!!  | Anchor Jhansi Made sensational comments on Choreographer Jani Master  case, here's the details - Telugu Filmibeat

వీరిలో కొందరు జానీ మాస్టర్ కు సపోర్ట్ గా మాట్లాడుతుంటే.. మరికొందరు మాత్రం ఆయన తప్పుపడుతూ చట్ట ప్రకారం శిక్షించాలని కోరుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇండస్ట్రీ కాస్త రెండుగా చీలిందని అనిపిస్తుంది. నిజానికి సినీ ఇండస్ట్రీలో ఇలాంటి ఆరోపణలు సర్వసాధారణం. కానీ ఇందులో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయో తెలియకుండానే.. తోటి పరిశ్రమకు చెందిన వ్యక్తులే రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇండస్ట్రీలోనే అగ్ర కొరియోగ్రాఫర్‌గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న జానీ మాస్టర్.. ఈ వివాదం తో ఒకసారిగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Jani Master,హీరోగా మారుతున్న జానీ మాస్టర్.. పవన్‌తో ప్రాజెక్ట్ సంగతేంటో! -  tollywood choreographer jani master turns as hero - Samayam Telugu

ఇప్పటికే ఆయన్ను జనసేన కార్యక్రమాలకు దూరంగా పెట్టేసారు. అలాగే డ్యాన్స్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు తాజాగా గోవాలో జానీ మాస్టర్ పట్టు పడడం.. పోలీసులు వెంటనే హైదరాబాద్‌కు తీసుకువచ్చి ఉప్పరపల్లి కోర్టులో హాజరు పరిచయడం.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడం అంత శ‌ర‌వేగంగా జరిగిపోయింది. ఇక జానీ మాస్టర్‌ను విచరించేందుకు పోలీసులు కోర్టును తొమ్మిది రోజులు కస్టడీ కోరారు. కాగా దీనిపై కోర్టు ఇంకా నిర్ణయాన్ని వెలువడించలేదు.