ప్రస్తుతం తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి ఎదగడంతో కేవలం ఫ్రీ రిలీజ్ బిజినెస్‌లే కోట్లల్లో వసూళ్లు చేస్తున్నాయి. అలా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన మొదటి సినిమా బాహుబలి నుంచి దేవర వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్‌లో సత్తా చాటిన టాప్ 10 తెలుగు సినిమాల వివరాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.
ఆర్ఆర్ఆర్
దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా తరికెక్కిన మల్టీ స్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ టాలీవుడ్ ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ డిజిటల్, సాటిలైట్, థియేట్రికల్‌రైట్స్ అన్నీ కలిపి దాదాపు రూ.480 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్‌లు జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రూ.191 కోట్ల వ్యాపారం జరిగిందట.
కల్కి 2898 ఏడి
మహానటి ఫ్రేమ్ నాగ్ అశంవిన్ డైరెక్షన్లో ప్రభాస్, అమితాబచ్చన్, కమల్ హాసన్ కీలకపాత్రలో నటించిన మూవీ కల్కి 2898 ఏడి. ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టించింది. రిలీజ్ బిజినెస్ కింద ఏకంగా రూ.385 కోట్ల వ్యాపారం జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక కేవలం తెలుగు రాష్ట్రాలన్నీ సినిమాకు రూ.150 కోట్లు ఓవర్సీస్ లో రూ.70 కోట్లు హిందీలో రూ.85 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట.
బాహుబలి 2
దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ప్రభాస్, అనుష్క, రానా కీలక పాత్రలో నటించిన సిరీస్ బాహుబలి 2 సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చాయి. ఇక ఫ్రీ రిలీజ్ బిజినెస్ కింద ఏకంగా రూ.350 కోట్ల వ్యాపారం జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక కేవలం తెలుగు రాష్ట్రంలోనే ఈ సినిమాకు రూ.190 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
సలార్
కేజిఎఫ్ సీరీస్‌లతో బాక్స్ ఆఫీస్ లో బ్లాస్ట్ చేసిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో.. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ దేశవ్యాప్తంగా భారీ అంచనాలతో రిలీజ్ అయింది. ఈ క్రమంలో సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ లో రూ.345 కోట్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.120 కోట్ల బిజినెస్ జరిగిందట.
సాహో
బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన మూవీ సాహో. సుజిత్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే మంచి అంచనాలు నెలకొనడంతో ఫ్రీ రిలీజ్ బిజినెస్‌లోనే దుమ్మురేపింది. ఏకంగా రూ.333 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ లు జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. నార్త్ ఇండియాలో దాదాపు రూ.120 కోట్ల వరకు వ్యాపారం చేసి రికార్డు సృష్టించింది.
ఆదిపురుష్
ఓం రౌత్ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్. రామాయణాన్ని బేస్ చేసుకుని రూపొందించిన ఈ సినిమాలో కృతి సనన్ సీతా రోల్‌లో నటించింది. మైథాలజికల్ మూవీ కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో భాగంగానే ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే లెవెల్ లో జరిగింది. ఏకంగా ఈ సినిమాకు రూ.250 కోట్లకు పైగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ లు జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
రాదేశ్యామ్
రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాదేశ్యామ్ ప్రేక్షకుల్లో రిలీజ్ కు ముందు మంచి అంచనాలను నెలకొల్పింది. ఈ క్రమంలోనే సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా రూ.250 కోట్ల వరకు జరిగిందట. కేవలం తెలుగు రాష్ట్రాల్లో రూ.107 కోట్ల వ్యాపారం చేసినట్లు టాక్.
పుష్పా
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రష్మిక మందన, పహాధ్ ఫాజిల్ కీలకపాత్రలో నటించిన పుష్పా ది రైజ్ కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఏ దాదాపు రూ.160 కోట్ల వరకు జరిగిందని అంచనా.
దేవర పార్ట్ 1
కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కిన దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కు ముందే ప్రేక్షకుల విపరీతమైన అంచనాలను నెలకొన్నాయి. ఇందులో భాగంగానే వారల్డ్ వైడ్‌గా ఫ్రీ రిలీజ్ బిజినెస్ కింద ఏకంగా రూ.150 కోట్ల వ్యాపారం జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
సైరా నరసింహారెడ్డి
మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి బయోపిక్ సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ లో రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.208 కోట్ల బిజినెస్ జరుపుకుంది. ఒక తెలుగు రాష్ట్రంలోనే రూ.108 కోట్ల బిజినెస్ జరిగింది.