కెరీర్లో సక్సెస్ సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలంటే.. ఎవరికైనా అది సులువు కాదు.. దాని వెనక ఎంతో కష్టం, అహర్నిశలు శ్రమ, అవమానాలు, కన్నీళ్లు ఇలా ప్రతిదీ చూసే ఉంటారు. అలా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా ఇలవేల్పులుగా కొలిచే హీరో, హీరోయిన్లు కూడా చాలామంది స్టార్స్ కాకముందు తిండికి కూడా లేక పస్తులు ఉన్న సందర్భాలు వింటూనే ఉన్నాం. ఎన్నో కలలతో తల్లిదండ్రులను, పుట్టిన ఊరుని వదిలేసి మరీ వేరే ప్రాంతానికి వచ్చి పరిచయం లేని మనుషులతో గడపాల్సి ఉంటుంది. అవకాశాలు లేకపోయినా తిరిగి వెళ్ళకుండా కష్టపడి అనుకున్నది సాధించిన సెలబ్రిటీస్ కూడా ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలోనే నేషనల్ క్రష్ త్రిప్తి దిమ్రి కూడా ఒకటి. తన కెరీర్ తొలినాళ్లల్లో పడిన ఇబ్బందులను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది త్రిప్తి.
ఈ అమ్మడుకు సినీప్రియులలో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రణ్‌బీర్ కపూర్ హీరోగా.. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో తెరకెక్కిన యానిమల్‌లో జోయాగా కనిపించి కుర్ర కారును ఆకట్టుకున్న ఈ అమ్మడు.. ముఖ్యంగా రణ్‌బీర్‌తో కలిసి చేసిన బెడ్ రూమ్ బోల్డ్ సీన్స్ తో విపరీతమైనక్రేజ్ ను సంపాదించుకుంది. అదే టైంలో విమర్శలను కూడా ఎదుర్కొంది. ఇక ఈ మూవీతో సోషల్ మీడియాలో త్రిప్తి దిమ్రి హాట్ టాపిక్ గా మారింది. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత నేషనల్ క్రష్‌గా మారిన ఈ అమ్మడు.. ప్రస్తుతం వరుస అవకాశాలను అందుకుంటుంది. అలా బాలీవుడ్ లో దాదాపు మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నా త్రిప్తి ఇటీవట బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ చేసిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిప్తి.. తాజాగా తన లైఫ్ లో జరిగిన బాధాకర విషయాలను షేర్ చేసుకుంది.
ఇండస్ట్రీకి వెళ్తానంటే ఇంట్లో వాళ్లంతా టెన్షన్ పడ్డారని.. తానే ధైర్యం చేసి ముంబైకి వచ్చేసానని.. ఇక్కడకు వచ్చాక ఒకే గదిలో దాదాపు 50 మందితో కలిసి ఉండాల్సి వచ్చిందని.. తృప్తి చెప్పుకొచ్చింది. ప్రతిరోజు అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నానని.. అవకాశాలు రాక బాధపడ్డానని.. అయినా తల్లిదండ్రుల దగ్గరికి తిరిగి వెళ్లలేదని ఎంతో నొప్పిని భరించానంటూ త్రిప్తి దిమ్రి చెప్పుకొచ్చింది. ఇక అదే సమయంలో నా బంధువులు, చుట్టుపక్కల వారంతా తల్లిదండ్రులకు లేనిపోనివి చెప్పి వారిని ఇబ్బంది పెట్టారని.. నాకు పెళ్లి కాదని ఎవరు నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారని.. నూరిపోసేవారు అంటూ చెప్పుకొచ్చింది. అలాంటి క్రమంలో లైలా మజ్ను సినిమా రావడంతో నా పేరెంట్స్ కూడా ఎంతో సంతోషించారని.. అమ్మడు వివరించింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారడంతో ఇన్ని కష్టాలు పడింది కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉంది అంటూ.. నేషనల్ క్రష్ గా త్రిప్తి దిమ్రి ఇమేజ్ సంపాదించుకోవడానికి వెనుక ఇంత కష్టం ఉందా అంటూ కామెంట్లు చేస్తున్నారు.