బాలయ్య ‘ అఖండ 2 ‘లో చైనీస్ విలన్.. అఫీషియల్ ప్రకటన వైరల్..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ, బోయపాటి కాంబోలో చివరిగా తెర‌కెక్కి బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్న అఖండకు ఆడియన్స్‌లో ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాలో మాస్ యాక్షన్ సన్నివేశాలకైతే థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. ఏకంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి భారీ సక్సెస్ అందుకున్న ఈ సినిమాకు.. సీక్వెల్ గా అఖండ 2 రానుంద‌ని బోయపాటి గతంలో అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్‌పైకి వస్తుందా.. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా.. అంటూ బాలయ్య అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం అఖండ 2 స్క్రిప్ట్‌పై బోయపాటి వర్క్ చేస్తున్నట్లు సమాచారం.

అంతేకాదు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ప్రారంభమైందట. ఈ క్రమంలో అఖండ 2 విలన్‌గా చైనీస్ వ్య‌క్తిని తీసుకోన‌న్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అఖండ 2 సినిమాకు సంబంధించిన నటీనటుల‌ ఎంపిక కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో మెయిన్ విలన్ పాత్ర కోసం చైనీస్ వ్యక్తి లేదంటే.. నార్త్ – ఈస్ట్ ప్రాంతానికి చెందిన వ్యక్తులను తీసుకోవాలని ఆలోచనలో ఉన్నారు టీం. అద్భుతంగా యాక్టింగ్ లో అనుభవం, హావభావాలను పలికించే వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. సదరు యాక్టర్ వయసు 50 నుంచి 55 ఏళ్లు ఉండాలని ఆడిషన్ ఇండియా ఇన్స్టా పోస్ట్‌ ద్వార అఫీషియల్ గా వెల్లడించారు. మరోవైపు అఖండ 2 సినిమాల్లో ప్రైమరీ రోల్ కోసం 16 నుంచి 18 ఏళ్ల యువతిని తీసుకోనున్నట్లు వివరించారు.

ఈ క్యారెక్టర్ కోసం మంచి టాలెంట్ ఉన్న ఇండియన్ అమ్మాయిని తీసుకోవాలని టీం భావిస్తున్నారట, రాష్ట్రం ఏదైనా.. భాష ఏదైనా.. పర్వాలేదని అద్భుతంగా నటన చేస్తే సరిపోతుందని.. వారు తమ ఇన్‌స్టా వేదిక‌పై ప్రకటించారు. ఇక ఈ ఏడాది చివ‌ర్లో సినిమా సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉందని టాక్. ఇక బాలయ్య, బోయపాటి మరోసారి తమ కాంబోలో మరో బ్లాక్ బస్టర్‌ను చేయాలని చూస్తున్నారు. ఇక అఖండ 2లోను.. అఖండలో టైటిల్ రోల్ లాగా ఓ పవర్ఫుల్ పాత్రలో బాల‌య్య ప్రేక్షకులకు కనిపించనున్నాడని టాక్ నడుస్తుంది. ఇక ఈ సినిమాల్లో నటించే ఇతర నటినటులు ఎవరు అనేదానిపై రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది.