‘ దేవరలో ‘ తారక్ త్రిపాత్ర అభినయం.. తాత పాత్రలో కూడా యంగ్ టైగర్.. నిజం ఎంతంటే..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొర‌టాల కాంబోలో వ‌స్తున్న దేవర పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కథాంశంతో రానుంద‌ని సమాచారం. ఇక తార‌క్ దేవరలో డ్యూయల్ రోల్ లో క‌నిపించ‌నున్నాడు. కాగా దేవరలో ఈ రెండు పాత్రలు కాకుండా మరో పాత్ర కూడా ఉంటుందని.. ఆ మూడో పాత్ర తాత పాత్ర అంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. ట్రైలర్ లో ఓ షాట్ లో మండుతున్న కత్తులు పట్టుకుని ఎన్టీఆర్ ఉండ‌గా ఆ షాట్ లోనే మరో ఎన్టీఆర్ కనిపిస్తారని.. క్లైమాక్స్‌లో ఆ పాత్ర ఎంట్రీ ఉండ‌నుంద‌ని టాక్‌.

దేవర సినిమా ట్విస్టుల, యాక్ష‌న్ సీన్స్‌ గురించి వైరల్ అవుతున్న వార్తలు ఫ్యాన్స్‌కు ఎంతో ఆనందాని కలిగిస్తున్నాయి. దేవరలో తార‌క్ త్రి పాత్ర అభిన‌యం చేయ‌నున్నాడంటూ.. తండ్రీ, కొడుకు పాత్ర‌లే కాదు.. తాత పాత్ర‌లో కూడా తార‌క్ న‌టిస్తున్నాడంటూ వార్త‌లు వ‌నిపిస్తున్నాయి. ఈ వార్త‌లు నిజ‌మైతే మాత్రం అది సంచలనం అవుతుందన‌టంలో అతి స‌యోక్తి లేదు. ఇక కొరటాల ఈ సినిమా విషయంలో ఎలా ప్లాన్ చేశారో వేచి చూడాలి. దేవర సినిమాలో ఊహించని ట్విస్టులకు అస‌లు లోటే ఉండదని స‌మాచారం.

Devara Movie News | Devara update: Jr NTR Shooting For The Film in Goa |  Times Now

దీనికి త‌గ‌ట్టుగానే తార‌క్ ట్రైల‌ర్ లాంచ్‌లో చేసిన కామెంట్స్ సినిమాపై ఆశ‌క్తి పెంచుతున్నాయి. ఇక దేవర సినిమాలో తారక్ లుక్స్ విషయంలో కొంతమంది నెగిటివ్ కామెంట్లు, ట్రోల్స్ చేస్తుండ‌గా వాళ్లకు తాజాగా విశ్వక్ సేన్ తనదైన స్టైల్‌లో కౌంటర్లు ఇచ్చారు. దేవర సినిమాపై ఇండస్ట్రీ సైతం చాలా అంచ‌నాలు పెట్టుకుంది. ఇక ఈ నెల 27న రిలీజ్ కానున్న ఈ మూవీ ఎలాంటి రిజ‌ల్జ్ అందుకుంటుంది.. ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.