‘ దేవర ‘ ఫస్ట్ రివ్యూ.. ఎన్టీఆర్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్.. ఇక కలెక్షన్ల ఊచకోతే.. !

ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కనున్న తాజా మూవీ దేవర. రాజమౌళి డైరెక్షన్లో ఆర్‌ఆర్ఆర్ తర్వాత.. దాదాపు మూడేళ్ల గ్యాప్ తో తారక్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషన్ కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అంతేకాదు ఇటీవల ఎన్టీఆర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చేసిన కామెంట్స్ సినిమాపై మరింత అంచనాలను పెంచేసేయి. ఆఖరి 40 నిమిషాల్లో సినిమా ఓ రేంజ్ లో ఉంటుందంటూ ఆయన చేసిన కామెంట్స్ నెటింట‌ తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌తో కలిసి వార్‌2 సినిమాలో కనిపించనున్నారు. ఈ క్రమంలో దేవర హిట్ తారక్కు చాలా కీలకం. తెలుగులోనే కాదు హిందీలో కూడా దేవర బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడం అనేది ఎన్టీఆర్ కు చాలా అవసరం.

Jr NTR HD Stills: ఎన్టీఆర్‌ 'దేవర' ఫియర్‌ సాంగ్‌ ఫోటోలు వైరల్‌ | Fear Song  From Jr NTRs Devara Movie: Pics Viral | Sakshi

ఇక ఇప్పటికే సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. సినిమా రిలీజై ఫస్ట్ షో తో హిట్ టాక్ తెచ్చుకుంటే మాత్రం.. ఇంకా దేవరను ఆపేవారు ఉండరు అనడంలో సందేహం లేదు. ఈ సినిమా సక్సెస్ అయితే నార్త్ బెల్ట్ లోనే ఎన్టీఆర్‌కు ముజ‌ర‌న్ స్టార్‌గా ఇమేజ్ క్రియేట్ అవుతుంది. అయితే ఇప్పటికే సినిమాపై హైప్‌ తో పాటు.. కొంతమంది నుంచి ట్రోలింగ్స్ కూడా తారక్ ఎదుర్కొంటున్నాడు తార‌క్‌. ఆచార్య సెగలు కనిపిస్తున్నాయంటూ.. కొంతమంది దేవరపై ట్రోల్స్ చేస్తూ ఈ సినిమా ఫ్లాప్ అవుతుందంటూ నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఇక దేవర రెండు భాగాలుగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు.. యూ/ఎ సర్టిఫికెట్ వచ్చింది. ఇక రన్ టైం దాదాపు మూడు గంటలు ఉండనుంది.

Chuttamalle from Devara Part 1: Jr NTR, Janhvi Kapoor remind fans of NTR,  Sridevi in romantic song - Hindustan Times

కాగా సినిమా ఫ‌స్ట్ రివ్యూ చ‌క్క‌ర్లు కొడోతుంది. ఇన్టీఆర్ యాక్షన్ సీన్స్ గూస్‌బంప్స్‌ తెప్పించేలా ఉంటాయని.. తారక్, జాన్విల కెమిస్ట్రీ వేరే లెవెల్ లో ఉందని.. క్లైమాక్స్ సినిమాకు ప్రాణం పోసినట్లు ఉంటుందని.. కామెడీ కూడా ప్రేక్షకులు బాగా ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. ఇక ఇప్పటివరకు వినిపిస్తున్న సెన్సార్ రివ్యూను బట్టి.. తారక్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పక్క అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి కలెక్షన్ల సునామీ కాయమట. ఇదిలా ఉంటే ఈ సినిమాలో తారక్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్న సంగతి తెలిసిందే. గతంలో ఆంధ్రావాలా, శక్తి, అదుర్స్ సినిమాల్లో డ్యూయల్ రోల్ లో నటించిన తారక్.. జై లవకుశలో త్రిబుల్ రోల్ లో నటించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే మరోసారి దేవరతో తండ్రి, కొడుకులా డ్యూయ‌ల్ రోల్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక ఈనెల 27 నా సినిమా భారీ లెవెల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ త‌ర్వాత సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.