ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ సెలబ్రిటీలుగా ఎదగాలంటే అది సాధారణ విషయం కాదు. టాలెంట్ తో పాటు అహర్నిశలు శ్రమించాలి. ఎంతో కొంత లక్ కూడా ఉంటేనే అది సాధ్యమవుతుంది. నటుడుగా ఎదిగే క్రమంలో వచ్చిన చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా అందిపుచ్చుకొని తమ్మ సత్తా చాటుకోవాల్సి ఉంటుంది. అలా ఇప్పటివరకు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి సక్సెస్ అందుకున్న వారిలో ఈ పై ఫోటోలో స్టార్ హీరో ధనుష్ వెనక సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించిన వ్యక్తి కూడా ఒకరు. ఈయన ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరోగా మంచి ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడు. మొదట చిన్న చిన్న పాత్రల్లో తన ప్రతిభను చూపి దర్శక, నిర్మాతలను ఆకట్టుకున్న ఈయన.. సపోర్టింగ్ రోల్స్ నుంచి కీలకపాత్రలో నటించే స్టేజికి ఎదిగాడు.
తర్వాత హీరోగా పలు సినిమాల్లో నటించే అవకాశాలను అందుకుని నట విశ్వరూపాన్ని చూపించాడు. ఇంతకీ ఇతను ఎవరో చెప్పలేదు కదా.. తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి. తమిళనాడులో రాజఫలయంలో జన్మించిన విజయ్.. నటుడు కావాలని ఇంట్రెస్ట్‌తో చెన్నైలో అడుగు పెట్టాడు. వేషాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ఇక 1996లో లవ్ బర్డ్స్ సినిమా లో ఓ చిన్న పాత్రలో అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఆ సినిమాలో ప్రభుదేవా, నగ్మా జంటగా నటించారు. అదే ఏడాది గోకులతిల్‌సీతై సినిమాలో అన్ క్రెడిట్ రోల్ దక్కించుకొని ప్రేక్షకులను మెప్పించాడు. అయితే ఈ సినిమా తర్వాత దాదాపు 8 ఏళ్ల వరకు ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు. 2004లో తిరిగి రీఎంట్రీ ఇచ్చాడు 2010 వరకు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. శశి కుమార్ హీరోగా తెరకెక్కిన సుందర పాండియన్ ఈయనకు బ్రేక్ ఇచ్చింది.
ఈ సినిమాలో కీరోల్లో నటించిన విజయ్ సేతుపతి తమిళనాడు స్టేట్ అవార్డును దక్కించుకున్నాడు. 2012లో రిలీజ్ అయిన పిజ్జాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి సంచలన సక్సెస్ అందుకున్నాడు. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్లో క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాలో విజయ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాలో విజయ్ నటనకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు కూడా దక్కింది. ఈ క్రమంలో వరుసగా హీరోగా నటించే అవకాశాలను దక్కించుకొని విలక్షణ పాత్రలను ఎంచుకుంటూ పాన్ ఇండియన్ స్టార్ హీరో స్టేజ్ కు ఎదిగాడు. తెలుగులోను సైరా నరసింహారెడ్డిలో ఓ కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇక మెగా హీరో వైష్ణవ తేజ్ ఉప్పెన సినిమాలోని ఓ పవర్‌ఫుల్ విలన్ పాత్రలో ఆకట్టుకున్నాడు. హిందీలోనూ పలు సినిమాల్లో, వెబ్ సిరీస్లలో నటించి ఇండియన్ వైడ్‌గా ఫేమ్ సంపాదించుకున్న విజయ్ సేతుపతి.. సూపర్ డీలక్స్ సినిమాలో తనకు సపోర్టింగ్ యాక్టర్ కేటగిరీలో జాతీయ అవార్డును దక్కించుకున్నాడు.