నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న తాజా మూవీ దేవర. ఈనెల 27న సినిమా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అయితే కొరటాల శివ దేవర కంటే ముందు ఆచార్య సినిమాతో ఆడియన్స్‌ను పలకరించాడు. ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. దీని ప్రభావం దేవరపై నిన్న మొన్నటి వరకు పెద్దగా కనిపించకపోయినా.. తాజాగా రిలీజ్ అయిన దేవర ట్రైలర్‌తో సినిమాపై భారీగా అంచనాలు తగ్గాయి. దేవర ట్రైలర్ చూస్తే ఆచార్య సెగలు కనిపిస్తున్నాయి అంటూ కథ రొటీన్‌గా అనిపిస్తుంది అంటూ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. షాక్ ఫ్యాక్టర్ ఏమీ లేకపోవడం సినిమాకు మైనస్ అయ్యేలా ఉంది.
దీంతో ఒక్కసారిగా దేవరను ఆడియన్స్ చూసే కోణం అంతా మారిపోయింది. ఈ సినిమా అనుకున్నంత బ్లాక్‌బస్టర్ సక్సెస్ దక్కదేమో.. పాన్ ఇండియా స్థాయిలో ప్రకంపనాలైతే కష్టమే అన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. అయితే ఇలా అంచనాలు తగ్గిపోవడం మంచిదా.. కాదా.. అన్న చర్చ ప్రస్తుతం నెటింట హాట్ టాపిక్ గా ఉంది. ఓ రకంగా ఇది దేవరకు మంచిదే అన్న అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దేవరకు మొదటి నుంచి ఏవేవో కారణాలతో అవసరానికంటే ఎక్కువగా అంచనాలు పెరిగిపోయాయి. ఇది మన గేమ్ ఆఫ్ థ్రోన్ అంటూ కళ్యాణ్ రామ్ చేసిన కామెంట్.. దీనికి తోడు టీంలో కొందరి మాటలు ప్రేక్షకులను మరి ఎక్కువగా ఊరించాయి.
అంతటి అంచనాలతో సినిమా చూస్తే.. సినిమా ఎంత బాగున్నా ఆడియన్స్ లో నిరాశ ఎదురవుతుంది. దీంతో పెద్ద సినిమాలకు ఈ రేంజ్ లో అంచనాలు అంటే రిజల్ట్ పై ప్రభావం తప్పక పడుతుంది. ఈ క్రమంలో ట్రైలర్ లాంచ్ తర్వాత హైప్ తగ్గడంతో దేవరను సాధారణ సినిమాలాగే చూస్తారు. ఆచార్యతో పోలికల వల్ల నెగటివ్ దృష్టితో సినిమా చూసే అవకాశం ఉంటుంది. సినిమా దానికి భిన్నంగా.. మెరుగ్గా కనిపిస్తే అప్పుడు సినిమా రిజల్ట్ వేరే లెవెల్‌లో ఉంటుంది అనడంలో సందేహం లేదు. నెగటివ్ దృష్టితో చూసే సినిమా మెరుగ్గా ఉంటే ప్రేక్షకుల్లో సినిమా బాగుంది అనే తృప్తి వస్తుంది. ఆ కోణంలో చూస్తే దేవరపై విడుదలకు ముందు అంచనాలు తగ్గడం ఒక విధంగా మంచిదే అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.