బాలయ్య వెంట ఎప్పుడు ఆ బ్యాగ్ ఉండాల్సిందే.. అందులో ఏముంటాయంటే..?

నందమూరి న‌ట‌సింహం.. సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న బాలయ్య.. కల్మషం లేని మనిషి. మైండ్ లో ఏది ఉంటే అది బయటకు అనేస్తారు. బాలయ్యకు కోపం ఎక్కువ. అంతే ప్రేమ కూడా ఉంటుంది. స్టార్ హీరోగా బాలయ్య వెంటే ఎప్పుడు హై సెక్యూరిటీ ఉంటుందని సంగతి తెలిసిందే. అంతే కాదు ఆయన వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకోవడానికి కూడా వెంట సిబ్బంది ఉంటూనే ఉంటారు. ఆయన సామాన్లు కూడా వాళ్ళు క్యారీ చేస్తారు. కానీ బాలయ్య ఎప్పుడు ఎక్కడికి వెళ్లినా ఒక బ్యాగ్ మాత్రం తన వెంట ఉంచుకుంటాడు.

Nandamuri Balakrishna: ఒంగోలు కు బాలయ్య.. అందరి చూపు ఆ బ్యాగ్ పైనే - NTV  Telugu

స్వయంగా ఆయన క్యారీ చేస్తాడు. ఆ బ్యాగ్ ఎందుకు అంత స్పెషల్.. అందులో ఏముంటుందని.. తెలుసుకోవాలని ఆశ‌క్తి అభిమానులోనూ ఉంటుంది. అయితే కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బాలయ్య బ్యాగ్‌లో ఎప్పుడు మెన్షన్ హౌస్ బాటిల్.. అలాగే ఒక హాట్ వాటర్ బాటిల్ క్యారీ చేస్తూ ఉంటారట. వేడి నీళ్లతో కలిపి మెన్షన్ హౌస్ తాగడం బాలకృష్ణకు అలవాటు. ఆయన ఎక్కడికి వెళ్లినా హాట్ వాటర్, మ్యాన్షన్ హౌస్ బాటిల్ ఆ బ్యాగ్ లోనే ఉంటుందని.. చివరకు విదేశాలకు వెళ్లాల్సిన ఆయన ఆ బ్యాగులు మాత్రం మిస్ చేయడని ఓ సందర్భంలో స్వయాన చిన్నల్లుడు శ్రీ భరత్ వివరించారు. ఇంటర్వ్యూలో శ్రీ భారత్ మాట్లాడుతూ మావయ్య మాన్షన్ హౌస్ తాగుతాడని.. ఇది తెలిసిన తర్వాత కంపెనీ స్టాక్ విలువ కూడా పెరిగింది అంటూ చెప్పుకొచ్చారు.

Exclusive Nandamuri balakrishna Lion🦁Bag with Kid #lion #lions #nbk  #nbk107 #balayya #balayyababu - YouTube

ఆయన హాట్ వాటర్‌లో కలుపుకొని తాగుతారట కదా అని యాంకర్ ప్రశ్నించగా.. అది నిజమే అంటూ దానిపై రియాక్ట్ అయ్యారు. ఆయన దగ్గర ఎప్పుడూ ఒక బ్యాగ్ ఉంటుంది. అందులో హాట్ వాటర్, మాన్షన్ హౌస్ తప్పకుండా ఉంటాయి. ఎక్కడికి వెళ్లినా ఆ బ్యాగ్ ఆయన వెంట ఉండాల్సిందే. అమెరికా వెళ్ళిన దాన్ని ఆయన క్యారీ చేస్తారు అంటూ చెప్పుకొచ్చాడు. ఆ వీడియో అప్పట్లో వైరల్ గా మారింది. అయితే మామ మందు తాగుతాడు అంటూ ఏదో గొప్ప విషయాన్ని చెప్పినట్లు చెప్పుకొస్తున్నారే.. అలాంటి టాప్ హీరోకు మందు అలవాటు ఉందని పబ్లిక్ గా చెబితే ఆయన ఫ్యాన్స్ ఆయననుంచి ఇన్స్పైర్ అయ్యే ఛాన్స్ ఉంది. మద్యం తాగాలనే ఆలోచన వాళ్లకు రావచ్చు. ఇలాంటి కామెంట్స్ ఓపెన్ గా చేయడం అవసరమా అంటూ భరత్ పై నెగిటివ్ కామెంట్స్ చేశారు. భరత్ మాట‌లను బట్టి బాలయ్య‌కు మద్యం అలవాటు ఉందని క్లియర్ అయింది.