జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న తాజా మూవీ దేవర. సెప్టెంబర్ 27న సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. రిలీజ్‌కు ఇంకా రెండు వారాలే టైం కావడంతో సినిమా టీం ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ముంబైలో ట్రైలర్ లంచ్ గ్రాండ్ లెవెల్లో చేసిన సంగతి తెలిసిందే. దాదాపు మీడియా సంస్థలతోపాటు.. ఇన్ఫ్లుయెన్సర్‌ల వద్ద కూడా తారక్ సందడి చేసివచ్చాడు. ఇక రెండు, మూడు రోజులు ఆగి సౌత్‌లో ప్రమోషన్స్ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. ఈ విషయాలు పక్కన పెడితే సినిమా 2 గంటల 57 నిమిషాల 56 సెకండ్ల నడివి ఉండనుంది. ఇటీవల కాలంలో ఇంత నడివి వచ్చిన సక్సెస్ అందుకున్న సినిమాలు చాలా తక్కువ.
ఒక కమర్షియల్ సినిమాకి ఇది చాలా ఎక్కువ రన్ టైం అని అభిప్రాయాలు ఆడియన్స్ నుంచి వినిపిస్తున్న.. ఈ సినిమాని ఆంధ్ర, తెలంగాణలో అర్థరాత్రి ఒంటిగంటకే ప్రదర్శించేలా ఇప్పటికే ప్లాన్స్ మొదలుపెట్టారు. తెలంగాణలో ఎప్పటినుంచో ఈ ట్రెడిషన్ ఉన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లలో కాస్త ఇబ్బందిగా అనిపించినా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం రావడంతో ఈజీగానే పర్మిషన్లు దక్కుతాయని భావిస్తున్నారు. అదే ఇప్పుడు తారక్ అభిమానులను ఆందోళన పడుతుంది. ఒంటిగంటకు షోస్ వేస్తే ఫ్యాన్స్‌తో పాటు ఇతర ఆడియన్స్ కూడా వస్తారు. ఒంటిగంట నుంచి షోలు మొదలుపెడితే మూడు గంటల సినిమా పూర్తి అయ్యేసరికి తెల్లవారుజాము నాలుగవుతుంది. ఇక అంతసేపు సినిమా చూసిన తర్వాత వారి మైండ్‌సెట్ వేరుగా ఉంటుంది అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దానికి తోడు ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు.. సోషల్ మీడియాలో అభిమానుల హడావిడి.. అలాగే సినీ టెక్నీషియన్లు కూడా సినిమాపై మరింత హైప్‌ను పెంచేశారు. ఇంత హైప్ క్రమంలో అర్థరాత్రి ఒంటిగంట షోలు వేయడం దేవర సినిమాకి మైనస్ అవుతుందని.. ఒకవేళ సినిమా ఏ మాత్రం అంచనాలకు తగినట్లు లేకపోయినా.. నెగటివ్ టాక్ రావడంతో సినిమాకు ఎఫెక్ట్ అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ఉదయం 10:00 షో లేకపోతే 11 గంటల షో కి వెళితే పెద్దగా సమస్య ఉండదు. సినిమాలో చిన్ని చిన్ని అంచనాలను రీచ్ కాకపోయినా అభిమానులు అడ్జస్ట్ అయిపోతారు. అదే అర్ధరాత్రి షో నిద్ర ఆపుకొని మరి సినిమా చూస్తే సినిమా కాస్త నచ్చకపోయినా నెగటివ్ టాక్ విపరీతంగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో సినిమాపై ఇంపాక్ట్ డబ్బల్ అవుతుంది. ఇక పరిటాల కంటెంట్ పై టీంకు ఎంత నమ్మకం ఉన్న ఎర్లీ మార్నింగ్ షోస్ వేయడం వల్ల కాస్తంత మంచి జరుగుతుందని కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంలో సినిమా యూనిట్ ఎలాంటి డెసిషన్ తీసుకోనుందో వేచి చూడాలి.