తారక్, కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న తాజా మూవీ దేవర. ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ నెల 27న దేవర పార్ట్ 1 గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. జాన్వి కపూర్ హీరోయిన్గా, సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై కాస్త అంచనాలను తగ్గించిన ఆ హైప్ తగ్గడం కూడా మంచిదేనంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇక ఇప్పటికే సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ యుకెల్లో ప్రారంభమై సంచలనాలు సృష్టిస్తున్నాయి. ప్రీమియర్ షోలకి సెన్సేషనల్ డిమాండ్ ఏర్పడడం విశేషం. ఇంకా సినిమా రిలీజ్ కి రెండు వారాలు గ్యాప్ ఉండగానే.. ప్రీ రిలీజ్ బుకింగ్స్ లో ఏకంగా 15k పైగా టికెట్లు కేవలం సినీ ఓల్డ్ లోనే అమ్ముడుపోవడం నిజంగా గొప్ప విషయం. ఇదే విషయాన్ని మేకర్స్ పోస్టర్ ద్వారా అనైన్స్ చేశారు. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో అజయ్, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలకపాత్రలో కనిపించనున్నారు.
ఇక ఈ సినిమాకు మిడ్ నైట్ ఒంటిగంటకే ప్రీమియర్ షోలు వేయనున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక మూవీ టీం ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ ఖాయం అంటూ గట్టి నమ్మకంతో ఉన్నారు. సినిమాలో ఉండే ట్విస్టులు, యాక్షన్ సన్నివేశాలు వేరే లెవెల్‌లో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయని ఆడియన్స్‌కు మంచి ఫిస్ట్‌లా సినిమా ఉంటుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాలి.
View this post on Instagram